Dharani
కడుపులో పెట్టి చూసుకోవాల్సిన తల్లి కానరాని లోకాలకు వెళ్లింది. అమ్మ రాదని తెలిసి ఆ చిన్నారులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలిని ఆమె బిడ్డలు చివరి చూపు చూసుకుంటున్న ఫొటో ప్రతి ఒక్కరిని ఏడిపిస్తోంది. ఆ వివరాలు..
కడుపులో పెట్టి చూసుకోవాల్సిన తల్లి కానరాని లోకాలకు వెళ్లింది. అమ్మ రాదని తెలిసి ఆ చిన్నారులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలిని ఆమె బిడ్డలు చివరి చూపు చూసుకుంటున్న ఫొటో ప్రతి ఒక్కరిని ఏడిపిస్తోంది. ఆ వివరాలు..
Dharani
మనిషిని చంపాలంటే పెద్ద పెద్ద ఆయుధాలే అవసరం లేదు. ఒక చిన్న మాట చాలు.. ఎదుటివారి మనసు ముక్కలయ్యి.. వారు కృంగి కృశించి పోవడానికి. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత వేధింపులు కొత్త రూపం సంతరించుకున్నాయి.. అదే ట్రోలింగ్. ఎవరో తెలియదు.. ఎక్కడ ఉంటారో తెలియదు.. చేతిలో స్మార్ట్ ఫోన్, దానిలో ఇంటర్నెట్ బ్యాలెన్స్.. సోషల్ మీడియా యాప్‌లు ఉంటే చాలు.. ఇక రెచ్చిపోవచ్చు. ఎలాగు మన ముఖ చిత్రం ఎదుటివారికి కనిపించదు కాబట్టి.. నచ్చినట్లు వారిని మాటలతో హింసించి.. వేధించి రాక్షసానందం పొందవచ్చు. కానీ మన పైశాచిక ఆనందం వల్ల ఓ నిండు జీవితం తెల్లారిపోతుందని తెలిసినా మానుకోలేని దౌర్భగ్య స్థితిలో ఉంటున్నారు. ఎదురుగా వచ్చి మాట్లాడేవారిని ఎలాగైనా చిత్తు చేయవచ్చు. కానీ ఫేక్ ముఖాలు పెట్టుకుని.. కనీసం తమ ఉనికిని కూడా చాటుకోవడానికి భయపడే నీచులు.. ఆన్‌లైన్ వేదికగా చేసే ట్రోలింగ్‌ను తట్టుకోవడం చాలా కష్టం. ఎంతో మనో నిబ్బరం ఉంటే తప్ప ఆ సమస్య నుంచి బయటపడలేం. అంత ధైర్యం లేని వారు ఇదిగో ఇలా గీతాంజలిలా ప్రాణాలు తీసుకుంటారు.
ఎవరూ ఈ గీతాంజలి అంటే.. అతి సామాన్యమైన ఓ మహిళ. తెనాలిలోని ఇస్లాం పేటభర్త, ఇద్దరు పిల్లలు.. కష్టపడి పని చేసుకుని.. వారి బాగోగులు చూడటం ఇదే ఆమె దినచర్య. ఇక అందరికి ఉన్నట్లే ఆమెకి సొంతింటి కల ఉంది. కానీ ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలించదని తెలిసి.. ఆ కలను సమాధి చేసుకుంది. కానీ పేదల పాలిటి పెన్నిధిగా నిలిచిన సీఎం జగన్.. తన ఆడబిడ్డలాంటి గీతాంజలికి ఇంటి పట్టా అందించి.. తన చెల్లెమ్మ సొంతింటి కలను సాకారం చేశాడు. జీవితంలో తీరదనుకున్న కలను తన జగనన్న తీర్చడంతో ఆమె సంతోషం అంతా ఇంతా కాదు.
ఇదే విషయాన్ని సభా ముఖంగా ఎంతో సంతోషంగా వెల్లడించింది. ఈ విషయం చెప్తున్నప్పుడు ఆమె కల్లలో కనిపించిన ఆనందాన్ని వర్ణించలేం. అదుగో ఆ నవ్వు చూసి పచ్చ రాక్షసులు భగ భగ మండిపోయారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనే అస్త్రాన్ని వాడి.. ఆమె చనిపోయే వరకు వెంటాడారు. వారం రోజుల క్రితం తనకు సొంతింటి పట్టా వచ్చిందంటూ పట్టలేని సంతోషంతో మాట్లాడిన ఆ గొంతు ట్రోలింగ్‌ను తట్టుకోలేక నేడు మూగబోయింది. “సొంత ఇల్లు నా కల. ఇన్ని రోజులకు నెరవేరింది. నా పేరు మీద ఇంటి స్థలం పట్టా వచ్చింది. ఏ డబ్బులు కట్టకుండానే నాకు ఇంటి స్థలం వచ్చింది. మాకు అమ్మ ఒడి వస్తోంది. మా మామయ్యకు పింఛన్ వస్తోంది. మా అత్తకు చేయూత డబ్బులు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్న గెలవడం ఖాయం” అంటూ సంతోషం వ్యక్తం చేసిన గీతాంజలి.. ఇప్పుడు శాశ్వత నిద్రలోకి జారుకుంది.
ఆ వీడియో వైరల్ కావడంతో.. పచ్చ మూక ఆమెపై ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. ఆ వేధింపులు భరించలేని ఆ అమాయకురాలు.. కన్న బిడ్డల గురించి సైతం ఆలోచించకుండా.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది అంటే.. ఎంత మానసిక వ్యధ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల క్రితం ఎంతో సంతోషంగా కనిపించిన వారి తల్లి.. ఇప్పుడు చలనం లేకుండా పడి ఉండటం చూసి.. ఆ పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కడుపులో దాచుకోవాల్సిన తల్లి.. కనరాని లోకాలకు వెళ్లిందని తెలియడంతో.. ఆ పసి హృదయాల్లో తీరని దుఖం నెలకొంది. పట్లేని దుఖంతో కన్నతల్లిని కడసారి చూసుకుంటున్న ఆ చిన్నారుల ఫొటో ప్రతి ఒక్కరిని ఏడిపిస్తోంది. మరి వారిని ఎవరూ ఆదరిస్తారు.. అమ్మ ప్రేమను ఎవరూ పంచుతారు..కేవలం పార్టీల కోసం.. వెనకా ముందు చూడకుండా ఓ అభాగ్యురాలి ప్రాణం పోవడానికి కారణమైన పచ్చ మూకను ఎవరు శిక్షిస్తారు.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.
ఏంటి ఈవిడ చనిపోయిందా?
జగన్ నాకు మంచిచేసాడు అని చెప్పటం ఈమె చేసిన తప్పా
trolls చేసి నిండు ప్రాణాన్ని తీసారు కదరా ఎటు వెళ్తున్నది రా సమాజం
పాపం రా ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు
pic.twitter.com/LuJMMjHIgF— MBYSJTrends ™ (@MBYSJTrends) March 11, 2024