iDreamPost
android-app
ios-app

‘హెడ్ సెట్ పెట్టుకుని బైక్ నడిపితే రూ.20 వేలు జరిమానా?’ ప్రభుత్వం క్లారిటీ

‘హెడ్ సెట్ పెట్టుకుని బైక్ నడిపితే రూ.20 వేలు జరిమానా?’ ప్రభుత్వం క్లారిటీ

ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు.. ప్రయాణం సాఫీగా సాగేందుకు వాహనదారులు కొన్ని నింబధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకోసం వాహనదారులు ఏం చేయాలి అనే దానిపై.. మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చాలా క్లియర్ గా రూల్స్ ఉన్నాయి. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే వాహనదారులకు జరిమానా విధిస్తారు. ఎందుకంటే అలా మళ్లీ చేయకుండా ఉంటారు అని.. ప్రమాదాలు జరగకుండా ఉంటాయని. అయితే ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఎన్ని ఫైన్స్ వేసినా కొందరు మాత్రం బుద్ధి మార్చుకోరు.

అయితే అలాంటి వారికి కూడా గుండెల్లో గుబులు పుట్టించే వార్త ఒకటి రెండ్రోజులుగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. హెట్ సెట్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే.. రూ.20 వేలు జరిమానా విధిస్తారని చెబుతూ ఒక మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తపై వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. నిజంగానే రూ.20 వేలు ఫైన్ వేస్తారా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రజలు ఏది నిజం? ఏది అబద్ధం అనే ఆలోచన చేయడమే మానేశారు. ఒక మెసేజ్ రాగానే.. అదేదో యుద్ధంలాగా తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు అందరికీ పంపేస్తుంటారు.

అలా చేయడం వల్ల ఈ వార్త కూడా రెండ్రోజుల్లో బాగా వైరల్ గా మారింది. ఆ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో.. స్వయంగా ఏపీ రవాణా శాఖనే స్పందించింది. ఆ వార్తలపై ఓ క్లారిటీ కూడా ఇచ్చింది. ఈ వార్తలను ఏపీ రవాణా శాఖ కమిషనర్ ఖండించారు. అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేశారు. కేంద్రం నిబంధనల మేరకే రాష్ట్రంలో ఫైన్లు విధిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఎంత జరిమానా విధించాలో మోటార్ వెహికల్ చట్టంలో ప్రస్తావించారు.

మోటారు వెహికల్ యాక్టులో ఉన్న నిబంధన ప్రకారం మీరు హెట్ సెట్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2 వేలు జరిమానా విధిస్తారని చెప్పారు. ఒకసారి హెచ్చరించిన తర్వాత కూడా పదే పదే అలాగే డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే.. రూ.10 వేలు వరకు జరిమానా విధిస్తారంట. అయితే ఇది ఇప్పుడు తీసుకొచ్చిన ఫైన్ కాదని.. ఎప్పటి నుంచో అమలులోనే ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆ జరిమానాను పెంచే ఆలోచన కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు వార్తలను వాహనదారులు నమ్మొద్దంటూ సూచించారు. ఏపీ రవాణా శాఖ కమిషనర్ ఇచ్చిన క్లారిటీతో ఇప్పుడన్నా ఆ ఫేక్ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.