iDreamPost
android-app
ios-app

YS Jagan: “విద్య అందుబాటు”లో APకి తొలిస్థానం! జగన్ 5 ఏళ్ళ కష్టానికి ఫలితం!

  • Published Jan 08, 2024 | 2:33 PM Updated Updated Jan 08, 2024 | 2:33 PM

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. ఆయన అమలు చేసిన సంస్కరణల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేంద్ర నివేదికలే ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆ వివరాలు..

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. ఆయన అమలు చేసిన సంస్కరణల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేంద్ర నివేదికలే ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆ వివరాలు..

  • Published Jan 08, 2024 | 2:33 PMUpdated Jan 08, 2024 | 2:33 PM
YS Jagan: “విద్య అందుబాటు”లో  APకి తొలిస్థానం! జగన్ 5 ఏళ్ళ కష్టానికి ఫలితం!

ప్రపంచాన్ని మార్చగల శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది అన్న నెల్సన్ మండేలా వ్యాఖ్యాల్ని బలంగా నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పిల్లలకిచ్చే ఏకైక ఆస్తి విద్య. వారికి నాణ్యమైన విద్యను అందిస్తే చాలు.. ఇక వారి భవిష్యత్తు గురించి ఎలాంటి చింత అక్కర్లేదు. ఇప్పుడు పునాదులు బలంగా పడితేనే.. వాటిపై ఆధారపడి ఉన్న భవిష్యత్తు కూడా బలంగా ఉంటుంది అని నమ్మడమే కాక ఆచరించి చూపారు సీఎం జగన్. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యా రంగంలో సమూల మార్పులు చేశారు.

ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అక్షరాస్యత అనగానే కేరళ గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడా స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చి చేరింది. పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో విద్యా సౌలభ్యం సులభంగా అందించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి.. ఏపీ ముందు స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర నివేదికలే వెల్లడించాయి.

అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంస్కరణలు చక్కని ఫలితాలిస్తున్నాయి. తాజాగా ప్రధాని ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ ఇన్‌ ఇండియా నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిబేక్‌ దేబ్రాయ్‌ విడుదల చేసిన నివేదికలో ఏపీకి గుర్తింపు దక్కింది. ఫౌండేషన్‌ ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో అక్షరాస్యత, ఇతర అంశాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు సాధించింది.

ఓ మనిషి భవిష్యుత్తు బాగుండాలన్నా.. అతడి కుటుంబం అభివృద్ధి చెందాలన్నా.. తద్వారా సమాజం పురోగతి సాధించాలంటే ముందుగా కావాల్సింది నాణ్యమైన విద్యం. ఈ విషయాన్ని సీఎం జగన్ బలంగా నమ్మడమే కాక.. అధికారంలోకి వచ్చాక ఆచరించి చూపారు. అందుకు నిదర్శనమే.. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా.. విద్యారంగం కోసం ఏకంగా బడ్జెట్ లో 12 శాతం నిధులు కేటాయించారు. అంటే ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వం చదువు కోసం 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

తండ్రి బాటలోనే తనయుడు..

అయితే ఈ విషయంలో జగన్ కు ఆదర్శం.. ఆయన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చాక.. పేద వారు సైతం పెద్ద చదువులు చదవాలనే ఉద్దేశంతో.. ఫీజు రీయంబర్సమెంట్ పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్ వంటి టెక్నికల్ కోర్సులను వారి చెంతకు చేర్చారు. ఆ తర్వాత పాదయాత్ర సందర్భంగా జగన్.. తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేరుస్తూ.. విద్యా రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు.

అమ్మఒడి..

పేదరికం కారణంగా ఏ తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపకుండా ఉండేలా చేయడం కోసం అర్హులైన ప్రతి విద్యార్థికి.. వారి తల్లి పేరు మీద రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తోంది జగన్ సర్కార్. అమ్మఒడి ఫలితాలు అత్యుత్తమంగా ఉన్నాయి. ఇందుకు నిదర్శనం.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు 10 శాతం పెరగ్గా.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రాపౌట్ రేటు 25 శాతం తగ్గింది.

నాడు-నేడు.. కేంద్రానికే స్పూర్తి

ప్రభుత్వ పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం కోసం ‘మన బడి – నాడు నేడు’ కార్యక్రమం ప్రాంరభించారు జగన్. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు, ఫర్నీచర్ మరియు ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పథకం కేంద్రానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ నాడు-నేడు ను స్పూర్తిగా తీసుకుని కేంద్రం కూడా పీఎం శ్రీ ని అమలు చేస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..

నేటి పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ రాకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం. దీన్ని గుర్తించిన సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. పేదల పాలిట ఈ పథకం వరంగా మారింది. దీన్ని ప్రారంభించిన రెండేళ్లలోనే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లల్లో జాయిన్ అయ్యే వారి సంఖ్య 40 శాతం పెరిగింది.

జగనన్న గోరు ముద్ద..

పేద వారికి మూడు పూటలా తిండి దొరకడమే గగనం. అలాంటప్పుడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలంటే అది వారికి తలకు మించిన భారం. ఈ విషయాన్ని గమనించిన జగన్.. గోరుముద్ద పథకం కింద మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. అలానే పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్, షూస్, స్కూల్ బ్యాగ్స్ తో పాటు డిక్షనరీ, పైతరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తూ.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..

జగనన్న విద్యా దీవెన పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈసీ, కాపు, మైనరిటీ, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ట్యూషన్, స్పెషల్ మరియు ఎగ్జామినేషన్ ఫీజుతో సహా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నారు. ‘జగనన్న వసతి దీవెన’ కింద విద్యార్థులకు హాస్టల్, మెస్ ఛార్జీలను కవర్ చేయడానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు.

జగన్నన్న విదేశీ విద్యా దీవెన..

విదేశాల్లో చదువుకోవాలంటే.. భారీగా ఖర్చు అవుతుంది. పేద వారు ఆ మొత్తన్ని భరించడం చాలా కష్టం. అలాంటి ప్రతిభావంతులను ఆదుకోవడం కోసం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభించారు. దీని కింద ప్రభుత్వం గుర్తించిన టాప్ విశ్వ విద్యాలయాల్లో సీటు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు 1.25 కోట్ల రూపాయలు, మిగిలన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తుంది.

ఇలా విద్యారంగం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సంస్కరణలు తీసుకువచ్చి సమూల మార్పులు చేశారు సీఎం జగన్. ఆయన తీసుకువచ్చిన పథకాలపై విదేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక జగన్ తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం ఏపీ అక్షరాస్యతలో ముందున్న కేరళతో పోటీ పడటమే కాక.. దాన్ని వెనక్కి నెట్టింది.