Arjun Suravaram
Jaleel Khan: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గతంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ట్రోల్స్ కి గురయ్యారు. తాజాగా మరోసారి ఆయన టంగ్ స్లిప్ అయ్యారు.
Jaleel Khan: మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. గతంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ట్రోల్స్ కి గురయ్యారు. తాజాగా మరోసారి ఆయన టంగ్ స్లిప్ అయ్యారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఎండకాలం వేడి సెగలను మించి.. ఏపీ పాలిటిక్స్ హీట్ ఉంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సీఎం జగన్..సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం రా..కదలిరా పేరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించి.. స్పష్టంగా ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తుంటో.. టీడీపీలో మాత్రం నేతల మధ్య అంతర్గత యుద్ధాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలానే విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానంలో టీడీపీలో టికెట్ వార్ ముదురుతోంది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నోరు జారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోందని సమాచారం. విజయవాడ వెస్ట్ లోని తెలుగు దేశం పార్టీలో ఈ టికెట్ వార్ నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇద్దరి నేతల మధ్య వివాదం మరింత ముదిరినట్లు స్థానికంగా వార్తలు వినిపిస్తోన్నాయి. ఇక్కడి నుంచి టికెట్ కోసం సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా తెరపైకి వచ్చారు. టికెట్ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలే తప్పవంటూ హెచ్చరించే క్రమంలో ఆయన నోరు జారారు.
విజయవాడ పశ్చిమలో టీడీపీ టికెట్ కోసం బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో టికెట్ వార్ ముదురుతోంది. ఇటీవలే ఓ మీటింగ్ లో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. విజయవాడ వెస్ట్ మైనారిటీలకు టికెట్ ఇవ్వకపోతే..వారు ఉరి వేసుకుంటారో.. ఏం చేసుకుంటారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. అయితే అంతకు ముందు ఆయన మాట్లాడుతూ..టికెట్ ఇవ్వకపోతే తానే ఉరేసుకుంటానంటూ నోరు జారారు.
ఆ తరువాత వెంటనే సవరించుకుని..తన వర్షన్ చెప్పుకొచ్చారు. మైనార్టీలకు గనుక టికెట్ దక్కకపోతే ఉరి వేసుకుంటారో, ఏం చేసుకుంటారో తెలియదంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యనించారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరేసుకునేందుకు ప్రయత్నించారని, తాను వారించి ఆపానని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు సర్వేలన్నీ కూడా తనకే అనుకూలంగా ఉన్నాయని, చంద్రబాబు ఈ స్థానం నుంచి మైనారిటీలకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు జలీల్ ఖాన్ తెలిపారు. ఆ తరువాత కూడా ఓ అడుగు ముందుకేసి విజయవాడ పశ్చిమ టికెట్ తనదేనని.. ఎన్నికల బరిలో నిలబడతానంటూ జలీల్ ఖాన్ బలంగా చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపైనే పవన్ కళ్యాణ్ ను కలిసి పరిస్థితి వివరించానని.. పొత్తులో భాగంగా ఈ సీటును వదిలేసుకోవాలని జనసేనను కోరారని ఆయన చెప్పుకొచ్చారు
మరోవైపు చంద్రబాబుకు దరఖాస్తు ఇస్తానంటూ బుద్దా వెంకన్న విజయవాడ వెస్ట్ లో ర్యాలీ నిర్వహించారు. దుర్గ గుడికి వెళ్లి విజయవాడ పశ్చిమ వెస్ట్ టికెట్ తనకే దక్కాలంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వడం కుదరకుంటే, అనకాపల్లి ఎంపీ సీటు అయినా ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబుని కోరే ఆలోచనలో వెంకన్న ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి.. విజయవాడ వెస్ట్ టీడీపీ టికెట్ విషయంలో టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.