వరద బాధితులకు AP ఉద్యోగులు రూ. 120 కోట్ల విరాళం

Andhra Pradesh Floods: గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Andhra Pradesh Floods: గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ని వర్షాలు ఇప్పట్లో వీడేలా లేవు. పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. వరుసగా పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ భారీ విరాళం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

ఏపీలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోయింది. బుడమేరు వాగు పొంగిపొర్లడంతో పలు కాలనీలు మొత్తం నీట మునిగిపోయాయి. ఇండ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏపీ ప్రజలను ఆదుకునేందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ముందుకు వస్తున్నారు. తమ స్థాయికి తగినట్లు విరాళం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ వరద బాధితుల కోసం తమ గొప్ప మనసు చాటుకుంది. రూ.120 కోట్లు విరాళం ప్రకటించారు.

ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలోని ఒక రోజు (బేసిక్ పే) ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయు, పెంచన్ల నుంచి ఈ విరాళం అందజేస్తామని జేఏసీ నాయకులు కె.వి.శివారెడ్డి, విద్యాసాగర్ సీఎం చంద్రబాబుకు అంగీకార పత్రం అందజేశారు. భారీ వర్షాల కారణంగా ఎంతో మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని.. వారి ఇబ్బందులు కొంత మేరకు తీరుతాయన్న సదుద్దేశంతో విరాళం ప్రకటించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

Show comments