iDreamPost
android-app
ios-app

వృద్ధ సైకో, పిల్ల సైకో, మరోసైకో రోడ్డున పడ్డారు: మంత్రి జోగి రమేశ్

వృద్ధ సైకో, పిల్ల సైకో, మరోసైకో  రోడ్డున పడ్డారు: మంత్రి జోగి రమేశ్

ఏపీలో రాజకీయా మంచి హాట్ హాట్ గా ఉన్నాయి. దేశంలో ఎక్కడిలేని రాజకీయం ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర తరువాత ఏపీ పొలిటకల్ సీన్ మారిపోయింది. వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు మారిపోయింది. పవన్ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే పవన్ విమర్శలకు వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేశ్ లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

శనివారం తాడేపల్లి లో రాష్ట్ర గృహణ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ ను సైకోలతో పోల్చారు. వృద్ధ సైకో, పిల్ల సైకో, ఇంకోక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారంటూ మండిపడ్డారు. లోకేశ్ ను ఉద్దేశిస్తూ.. లోకేశ్ అనే అప్పడం… గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో గంజాయి ఉందని ఫిర్యాదు చేశాడని, అతనికి ఉన్న అర్హత ఏంటని ప్రశ్నించాడు. వార్డు మెంబర్ గా  కూడా గెలవని వ్యక్తి గవర్నర్  కలిసి ఫిర్యాదు చేశాడని, గంజాయి సాగుని ధ్వంసం చేసి క్లీన్ ఏపీగా సీఎం జగన్ మార్చారని మంత్రి జోగి రమేశ్ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “అప్పట్లో  మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో గంజాయి సాగు విచ్చల విడిగా సాగింది. అప్పటి మంత్రులు గంజాయి వ్యాపారం చేశారు. మాటలేమో కోటలు దాటతాయి. చర్చకు రమ్మంటే పారిపోతారు. భూతాలు, పిశాచాలు, సైతానుల గురించి మనం పురాణాల్లో  విన్నము.  ఆముగ్గురే చంద్రబాబు, పవన్, లోకేశ్ లు. చంద్రబాబు భూతం, లోకేష్ సైతాను, పవన్ పిశాచి.  ఇక గంజాయి సప్లయ్  వ్యవహారంలో చంద్రబాబు, లోకేశ్ పాత్ర ఉందని అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు చెప్పారు. అలాంటి మీరు  మా ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తావా లోకేశ్?” అంటూ మంత్రి జోగి రమేశ్ నిలదీశారు. మరి.. మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పవన్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పర్సన్: మంత్రి అంబటి