iDreamPost
android-app
ios-app

APహైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి..

APహైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి..

సినీ, రాజకీయ కుటుంబాలకు చెందిన వారు వివిధ రకాల హోదాల్లో  పని చేస్తుంటారు. వారి వారి రంగాల్లో కృషి చేస్తూనే కొత్త రంగంవైపు వెళ్తుంటారు. డాక్టర్ చదివిన వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎంపిక అవుతుంటారు. నిత్యం రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే వాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. తాజాగా ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ  నల్లకోటు ధరించారు. ఏపీ హైకోర్టు న్యాయవాదిగా ఝాన్సీ మారారు.

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, ఝాన్సీ చదువుల్లోనూ రాణిస్తున్నారు. ఆమె ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అంతేకాక ఫిలాసఫీ, లా కోర్సుల్లో రెండు పీహెచ్‌‌డీలు పూర్తి చేశారు. తాజాగా న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా.. సతీమణి ఝాన్సీకి మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే ఆమె.. చదువుల్లోనూ రాణించారు. బొత్స ఝాన్సీ ఇప్పటివరకు రెండు సార్లు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా, రెండు సార్లు ఎంపీగా కూడా పని చేశారు.

ఆమె రాజకీయ జీవితం గురించి ఓ సారి చూస్తే.. 2006 బొబ్బిలి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఝాన్సీ పోటీ చేసి గెలిచారు. తర్వాత 2009 ఎన్నికల్లో కూడా విజయనగరం ఎంపిగా పోటీచేసి.. రెండో సారి కూడా ఎంపిగా ఎన్నికయ్యారు. కేంద్రంలో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. ప్రస్తుతం కూడా ఆమె రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. ఇలా యాక్టీవ్ పాలటిక్స్ లో బిజీగా ఉన్న కూడా ఎప్పుడూతన చదువుకు విరామం ఇవ్వలేదు. చదువుకు వయస్సు అడ్డు కాదని గట్టిగా నమ్మి ఆచరించారు.

ఈ క్రమంలోనే అనే డిగ్రీ పట్టాలు పొందిని ఆమె.. తాజాగా న్యాయశాస్త్రంలో కూడా పంచాయితీ రాజ్ ద్వారా మహిళ సాధికారిత, సామాజిక న్యాయశాస్త్రం అనే అంశంపై పిహెచ్‌డి పూర్తి చేశారు. ఇప్పుడు ఏపీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ మెంబర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆమెను మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించి ఒక మహిళగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బొత్సా ఝాన్సీకి పలువురు రాజకీయనేతలు శుభకాంక్షలు తెలియజేశారు. మరి.. బొత్సా ఝాన్సీకి మీరు అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భక్తుల భద్రతే తమకు ముఖ్యం అంటున్న TTD ఛైర్మన్ భూమన!