Dharani
బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి.. వారితో కలిసి తన ప్రాణాలు తీసుకుంది. ఇంత దారుణం నిర్ణయం వెనక ఆ తల్లి ఎన్ని కష్టాలు, అవమానాలు భరించిందో ఆ దేవుడికే తెలియాలి. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి.. వారితో కలిసి తన ప్రాణాలు తీసుకుంది. ఇంత దారుణం నిర్ణయం వెనక ఆ తల్లి ఎన్ని కష్టాలు, అవమానాలు భరించిందో ఆ దేవుడికే తెలియాలి. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Dharani
ఎన్ని కష్టాలు ఎదురైనా సరే.. తల్లి బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. బాధలను దిగమింగి బిడ్డల బతుకు కోసం పోరాటం చేస్తుంది. తాను చనిపోయినా పర్లేదు.. పిల్లలు మాత్రం నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటుంది. కష్టాలు, అవమానాలను భరిస్తూ.. బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చూస్తుంది తప్ప.. తనంతట తనే పిల్లల జీవితాలను అంతం చేయాలనుకోదు. ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆ తల్లి కష్టం భగవంతుడు కూడా తీర్చలేనిది అయి ఉంటుంది. అదుగో అలాంటి సంరద్భంలోనే మనసు చంపుకుని.. తనతో పాటు బిడ్డల ప్రాణాలు తీస్తుంది. మాతృమూర్తి తనతో పాటు.. బిడ్డలను కూడా చంపుకుంది.. అంటే ఆమె కష్టాన్ని ఎవరం ఊహించలేము. తాజాగా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డలతో కలిసి.. ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఆ వివరాలు..
ఇక ఈ దారుణం ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ప్రాణాలు తీసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూరు మండలం గొర్లపుల్లయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరికి.. కడప నగరానికి చెందిన శ్రీహరితో 21 ఏళ్ల క్రితం అనగా 2005లో పెళ్లైంది. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు ఫణికుమార్ (17) కాగా.. కుమార్తె ధనలక్ష్మి (16) ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో.. 12 ఏళ్ల కిందట కలతలు మొదలయ్యాయి. కుటుంబ పోషణ నిమిత్తం.. శ్రీహరి కువైట్ వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక గొడవలు పెరగడంతో.. ఉమామహేశ్వరి తనకు వద్దంటూ భర్త వాదనకు దిగాడు.
దీంతో ఉమామహేశ్వరి తన పిల్లలతో కలిసి 12 ఏళ్లుగా చెన్నూరులోని తన అన్న రాజేంద్రప్రసాద్ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇక ఉమామహేశ్వరి కొడుకు ఫణికుమార్ మోటారు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ధనలక్ష్మి ఇంటర్ పూర్తి చేసింది. చెల్లెలి కాపురాన్ని నిలబెట్టేందుకు రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. భర్త కువైట్ నుంచి వచ్చాక ఉమామహేశ్వరిని కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గొడవలు పెరిగి.. చివరకు కోర్టుకు వెళ్లారు. ఉమామహేశ్వరి తన భర్త నుంచి చట్ట ప్రకారం రావాల్సిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించింది. రూ.10 లక్షల నగదు ఇవ్వాలంటూ కోర్టు శ్రీహరిని ఆదేశించింది. అంత నగదు చెల్లించలేనంటూ నెలరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు శ్రీహరి.
ఉమామహేశ్వరి భరణం కోసం మరోమారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొంత మొత్తం భరణం చెల్లించాలని కోర్టు శ్రీహరిని ఆదేశించింది. ఈ క్రమంలో ఉమామహేశ్వరి కోర్టుల చుట్టూ తిరిగి జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తాను చనిపోయి.. బిడ్డలు మాత్రమే బతికుంటే.. వారి జీవితం ఆగమ్యగోచంర అవుతుందని భావించిన ఉమామహేశ్వరి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఈ నెల 27న సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంటి నుంచి వచ్చేసింది. అదే రోజు రాత్రి 10 గంటలకు అన్న రాజేంద్రప్రసాద్‌కు మొబైల్ ద్వారా మెసేజ్ పంపించింది. కుమారుడు, కూతురుతో సహా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇక సోమవారం ఉదయం పశువులకాపరులు ఉమామహేశ్వరి, ఆమె పిల్లల మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. వీరి మృతిపై ఉమామేశ్వరి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఉమాహేశ్వరి తన సోదరుడికి మెసేజ్ చేసింది.
‘‘అన్నా నన్ను క్షమించు.. జీవితంలో తొలిసారి నీకు చెప్పకుండా తప్పు చేస్తున్నా.. నాతో పాటు నా బిడ్డల్ని తీసుకెళ్తున్నా.. తల్లికన్నా ఎక్కువగా చూసుకున్నావు, ఇన్నాళ్లు నన్ను, నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. నా జీవితాన్ని బాగు చేయాలని ఎంతో శ్రమించావు. ఇక చాలు, నీకు భారం కాదలుచుకోలేదు. మా ఆత్మహత్యలకు భర్త శ్రీహరి, అత్త సరస్వతి, ఆడపడుచు శశికళతో పాటు లక్ష్మీపతి కారణం’’ అని ఆరోపించింది. చేతికి అంది వచ్చిన బిడ్డలతో కలిసి ఉమామహేశ్వరి ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.