P Krishna
ఏపీలో ఎన్నికల సందడి మొదలయ్యింది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజే చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
ఏపీలో ఎన్నికల సందడి మొదలయ్యింది. త్వరలో ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజే చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.
P Krishna
ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికల రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ తనదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ గెలుపు సాధించే దిశగా తమదైన ప్రచారం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. సీఎం జగన్ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ఎడ్యూకేషన్ కి సంబంధించి పలు స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో టెన్త్, ఇంటర్ షెడ్యూల్ రిలీజ్ అయింది. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఎగ్జామ్స్ మార్చి నెలలోనే నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా వేదికగా ప్రకటించారు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ వల్ల పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయవొచ్చని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. మొత్తం 16 లక్షల మందికి విద్యార్థులు ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన అన్నారు. టెన్త్ విద్యార్థులు ఆరు లక్షల మంది, ఇంటర్ విద్యార్థులు పది లక్షల మందికి ఉన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
మార్చి 1 నుంచి మార్చి 15 వ తేదీ వరకు ఇంటర్ థియరీ పరీక్షల తేదీలకు విద్యాశాఖ ఖారు చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఒక రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉంటే.. రెండో రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ నిర్వహించేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మార్చి 31 వ తేదీ వరకు 12 రోజులు షెడ్యూల్ ఖారారు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.3.0 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించబడుతాయని అన్నారు. ఈసారి పరీక్షలు పకడ్భందీగా నిర్వహిస్తామని.. ఎవరైనా లీకేజ్ వ్యవహారాలకు పాల్పపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.