Guntur Geetanjali Incident: గీతాంజలి ఆత్మహత్య ఘటనపై హోం మంత్రి కీలక వ్యాఖ్యలు!

టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోలింగ్స్ కారణంగా గీతాంజలి అనే ఓ సాధారణ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మానసికంగా వేధించడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోలింగ్స్ కారణంగా గీతాంజలి అనే ఓ సాధారణ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మానసికంగా వేధించడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైన సంగతి తెలిసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) అనే ఓ మహిళా టీడీపీ శ్రేణుల ట్రోల్స్ కి తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలానే ఏపీ రాజకీయలను కుదిపేస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే  పలువురు రాజకీయ నేతలు స్పందించారు. అలానే గీతాంజలి భర్త బాల చందర్ కూడా..తన భార్య మరణానికి సంబంధించి కీలక విషయాలను ప్రస్తావించారు. తాజాగా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యారు. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన వారిని వదిలిపెట్టమని మంత్రి అన్నారు.

మంగళవారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత.. ట్రోల్స్ గురై ఆత్మహత్య చేసుకున్న  గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆవేదనకు గురయ్యారు. గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తలు ట్రోల్స్ కారణమని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రాథమిక సమాచారం సేకరించామని, కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ పై నిఘాపెట్టామని ఆమె తెలిపారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని, జగనన్న వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించి మాట్లాడిందని ఆమె తెలిపారు.

అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ చేశారని హోం మంత్రి వనిత మండిపడ్డారు. కావాలనే గీతాంజలిపై ట్రోల్స్ చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మంత్రి అన్నారు. గీతాంజలి ఆత్మహత్యకు కారణమైన ఎవరినీ వదిలేదని హోం మంత్రి స్పష్టం చేశారు.  ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని హోం మంత్రి తెలిపారు.  మరో మహిళపై ఇలాంటి దారుణాలు జరగకుండా చర్యలు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. అలానే గీతాంజలి కుటుంబానికి  రూ.20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నామని ఆమె తెలిపారు.

అసలు విషయానికి వస్తే.. గీతాంజలి తనకు జరిగిన మంచి గురించి సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పులా ఉంది. ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి ఆమె వివరించింది. అలానే తన బిడ్డలకు అమ్మఒడి, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన ఓ మీడియా ముందు తెలిపింది. తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయ్యింది. ఇక ప్రభుత్వాన్ని పొగడటం గిట్టని టీడీపీ,జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు. ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు.

టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదటలు పెట్టారు. ఆమె శరీరాన్ని, ఆమె మాటల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు. తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు. అర్థరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు. వీళ్ల ట్రోల్స్ తట్టుకోలేక రైలు కిందపడి గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని అనాథలుగా మారారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మరి.. గీతాంజలి ఘటన విషయంలో హోం మంత్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments