Dharani
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పెట్టిన కండీషన్లు ఏవి అంటే..
ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడికి ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు పెట్టిన కండీషన్లు ఏవి అంటే..
Dharani
ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 52 రోజులుగా రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడికి.. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు అనగా నవంబర్ 24 వరకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం తీర్పును వెల్లడించారు. చంద్రబాబుకి ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని.. కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని.. ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. దాంతో కేవలం చంద్రబాబు అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని.. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది.
అయితే బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు కండిషన్లు పెట్టింది. కేవలం కంటి సర్జరీ కోసం మాత్రమే చంద్రబాబుకి బెయిల్ మంజూరు చేశామని కోర్టు వెల్లడించింది. ఆయన కేసుని ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని తెలిపింది. ఆస్పత్రికి, ఇంటికి మాత్రమే పరిమితం కావాలని ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని తెలిపింది. స్కిల్ స్కామ్ కేసులో మాత్రమే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని న్యాయవాది తెలిపారు. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్ మీద విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.
ఇద్దరు ష్యూరిటీలతో పాటు రూ.లక్ష పూచికత్తుతో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. సొంత ఖర్చులతో బాబు ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు చికిత్స వివరాలను సీల్డ్ కవర్‌లో పెట్టి జైల్ సూపరింటిండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఆ వివరాలను జైల్ సూపరింటెండెంట్.. ఏసీబీ కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. బెయిల గడువు ముగిసిన తర్వాత అనగా నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు.. చంద్రబాబు సరెండర్ కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.