P Krishna
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది కాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే వివరణకు ఏమ్మెల్యేలు గడువు కావాలంటూ హై కోర్టుని ఆశ్రయించారు.
ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది కాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే వివరణకు ఏమ్మెల్యేలు గడువు కావాలంటూ హై కోర్టుని ఆశ్రయించారు.
P Krishna
ఏపిలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అధికార పార్టీ పరిపాలనపై ప్రతిపక్ష నేతలు ఎన్నోరకాల విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ మరోమారు ఛాన్స్ ఇవ్వాలని అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇటీవల వైసీపీ లో కొంతమంది రెబల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించారు. ఏపీలో పార్టీ మారిన రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం వివరణ కోసం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే హైకోర్టుని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..
కోద్ది రోజుల క్రితం ఏపీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 29 వ తేదీన వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు అనర్హత వేటు నోటీసులు పంపడాన్ని వ్యతిరేకిస్తూ.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు హై కోర్టులు చుక్కెదురయ్యింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలంటూ దాఖలైన పిటీషన్ పై ఏపీ హై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వైసీపీ పార్టీ నుండి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈ క్రమంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం., ఈ దశంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. యిలే ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ను ఫిబ్రవరి 26వ తేదీకి ఏపీ హై కోర్టు వాయిదా వేసింది.