iDreamPost
android-app
ios-app

ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ వాయిదా!

  • Published Sep 13, 2023 | 12:10 PM Updated Updated Sep 13, 2023 | 12:10 PM
  • Published Sep 13, 2023 | 12:10 PMUpdated Sep 13, 2023 | 12:10 PM
ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ విచారణ వాయిదా!

సిల్క్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తరుపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలని సిద్దార్థ లుథ్రా కోర్టుని కోరారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేతల అయిన చంద్రబాబు ని అరెస్ట్ చేసే సమయంలో రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవలని ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. తాజాగా జరిగిన వాదనల అనంతరం క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే..

టీడీపీ నేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరుపు నుంచి సిద్దార్థ లుథ్రా, సీఐడీ తరుపు నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా చంద్రబాబు పై విచారణ ప్రాథమిక దశలో ఉన్న కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేయవొద్దని ఏఏజి పొన్నవోలు సుధాకర్ కోర్టుకి విన్నవించారు. ఈ క్రమంలోనే కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీనీ హైకోర్టు ఆదేశించింది.  తాజాగా ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై విచారణ వాయిదా పడింది. ఇరు వర్గాల వారి వాదనలు పూర్తిగా వినాల్సి ఉంటుందని చెప్పింది.

ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఈ నెల 19 వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. సీఐడీ పిటీషన్ పై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి విచారణ చేపట్టవొద్దని ఏసీపీ కోర్టును ఆదేశించింది. ఇప్పటి వరకు మూడు పిటీషన్ల విచారణపై వాయిదా వేసింది హై కోర్టు. పిటీషన్ పై విచారణ సందర్భంగా సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు తరుపు లాయర్ లూథ్రా ఏపీ హైకోర్టుకి విజ్ఞప్తి చేసిన మేరకు సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది. ఇదిలా ఉంటే.. గతంలో తాను పీపీగా పనిచేశానని, అభ్యంతరాలు ఉంటే ఏమైనా చెప్పొవొచ్చని జడ్జీ కోరారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే. వేరే బెంచ్ కు మారుస్తామని జడ్జీ చెప్పగా.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చంద్రబాబు తరుపు న్యాయవాది సిద్దార్థ లుథ్రా తెలిపారు.