iDreamPost
android-app
ios-app

APలో వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఒక్కోక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు!

  • Published Jul 20, 2023 | 10:32 AMUpdated Jul 20, 2023 | 10:32 AM
  • Published Jul 20, 2023 | 10:32 AMUpdated Jul 20, 2023 | 10:32 AM
APలో వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త.. ఒక్కోక్కరి అకౌంట్‌లో రూ.24 వేలు!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందాలని.. వారు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం అనేక రకాల నగదు బదిలీల పథకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహిళలు, చిరు వ్యాపరాలు, రైతులు, విద్యార్థులు ఇలా అందరికి ఉపయోగపడేలా నగదు అందజేస్తూ.. వారు ఆర్థికంగా పైగి ఎదగడం కోసం సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వారి ఒక్కొక్కరి ఖాతాలో 24 వేల రూపాయల జమ చేయనుంది. ఆ వివరాలు..

రాష్ట్రంలోని నేతన్నలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారిని ఆదుకోవడం కోసం జగన్‌ సర్కార్‌ వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింది అర్హులైన నేతన్నలందరికి.. ప్రతి ఏటా 24 వేల రూపాయల చొప్పున ఐదేళ్ల కాలానికి గాను 1,20, 000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. దానిలో భాగంగానే ఈ ఏడాదికి సంబంధించి వైఎస్సార్‌ నేతన్న నేస్తం విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరి పర్యటన సందర్భంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నిధులను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే అధికారులు, మంత్రులు సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం జగన్‌ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి నేతన్న నేస్తం నిధులు విడుదల చేస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేతలను ఆదుకోవడం కోసం జగన్‌ సర్కార్‌ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద అర్హత కలిగి సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ .1.2 లక్షలు సాయం అంద్వినుంది. ఈ పథకానికి అర్హులు కావాలంటే.. కచ్చితంగా చేనేత సంఘంలో నమోదు చేసుకోని ఉండాలనే నిబంధన ఉంది. అలాగే తప్పనిసరిగా దారిద్య్ర రేఖ దిగువన ఉండాలి.. మగ్గాలు ఎన్ని ఉన్నా సరే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆర్థిక సాయం అందజేస్తారు.

ఈ పథకానికి అర్హులైన వారు.. రాష్ట్ర చేనేత సంఘం జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అందజేయాలి. దరఖాస్తు చేసుకునేవారికి అడ్రస్, ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడి కార్డ్ వంటి గుర్తింపు కార్డు ఉండాల్సిందే. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది అర్హుల బయోమెట్రిక్ తీసుకుని వారి వివరాలు నమోదు చేస్తారు. ఆతర్వాత ఈ జాబితాను ఎంపీడీఓ, లేని పక్షంలో ఎంసీలు పరిశీలించి చేనేత శాఖ ద్వారా లిస్ట్ ఫైనల్ చేస్తారు. అనంతరం నేతన్న నేస్తం పథకానికి అర్హుల జాబితాలను సచివాలయాలలో పాటు అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాలు ప్రదర్శించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి