Dharani
వైద్య రంగంలో వినూత్న సంస్కరణలు చేపడుతోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే మెడిసిన్ సరఫరా ప్రారభించింది. ఆ వివరాలు..
వైద్య రంగంలో వినూత్న సంస్కరణలు చేపడుతోన్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే మెడిసిన్ సరఫరా ప్రారభించింది. ఆ వివరాలు..
Dharani
తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడేవారు. అప్పో సప్పో చేసి ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లేవారు. పల్లె, పట్టణం, నగరం అని తేడా లేదు.. ఏ సర్కారు ఆస్పత్రికి వెళ్లినా నరకమే. డాక్టర్లు, సిబ్బంది, మందుల కొరత ప్రజలను వేధించేంది. పైగా ఎక్కడికక్కడ నిరలక్ష్యం. అందుకే సర్కారు దవాఖాన అంటే భయంతో వణికిపోయేవారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. మరీ ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది వైసీపీ సర్కార్. ఆస్పత్రుల రూపు రేఖలు మార్చడమే కాక.. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 25 లక్షల రూపాయలకు పెంచింది. ప్రభుత్వ ఆస్పత్రల్లో మౌలిక సౌకర్యాలతో పాటు అన్ని రకాల సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. దాంతో ఒక్కప్పుడు సర్కార్ దవాఖానా అంటే భయపడ్డ జనాలు.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
ఇక వైద్యరంగంలో అనేక మార్పులు చేస్తోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇంటి ముంగిటకే వైద్యసేవలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటి అంటే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా మందులను డోర్ డెలివరీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. నిరుపేదలకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా తాజాగా ఏపీ ప్రభుత్వం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఖరీదైన మందులను పక్కాగా ప్యాక్ చేయించి మరీ వ్యాధిగ్రస్తులకు చేరుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజస్) సర్వేను పక్కాగా నిర్వహించింది. దానిలో భాగంగా ప్రజలకు అన్నీ రకాల వైద్య పరీక్షలు చేయించింది. ఈ క్రమంలో దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందిపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరమైన, అందుతున్న వైద్యసేవల వివరాలను ముందుగా మ్యాపింగ్ చేయించింది. బీపీ, షుగర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి అవసరమైన ఖరీదైన మందులను వ్యాధిగ్రస్తుల ఇంటికే పంపుతోంది ఏపీప్రభుత్వం.
ఇందుకోసం జగన్ సర్కార్ పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఆయా మందులను సిద్ధం చేయించి, వాటిని కట్టుదిట్టంగా ప్యాక్ చేసి విలేజ్ క్లినిక్‌లోని ఎంఎల్‌హెచ్‌పీకి చేరేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆ మందులను ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా రోగుల ఇంటికే వెళ్లి అందజేస్తున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆర్థిక భారం తప్పుతోంది. మందుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ కార్యక్రమం నిరుపేదలకు వరంలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దేశంలో ఎక్కడా లేని ఈ పథకం ఏపీలో అమలు అవుతోంది అంటే అందుకు కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అనగా.. 2019 నుంచి ఇప్పటి వరకు వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ఆస్పత్రుల ఆధునికీకరణ చేశారు. కొత్తగా 304 పీహెచ్‌సీలు పెట్టారు. 53 వేలకు పైగా వైద్య పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరత తీర్చారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో అవసరమైన అధునాతన యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక అధికారిక లెక్కల ప్రకారం 1,142 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్విరామంగా వైద్యం అందుబాటులో ఉంది. వాటిల్లో 160 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్ సర్కార్. ఇక పల్లెల్లో 2,500 మందికి ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవి సుమారు 11,480 ఉన్నట్లు అంచనా. ఈ క్లినిక్‌లను పీహెచ్సీలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఇంటికే మందులు పంపుతూ.. పేదల పాలిట వరంగా మారింది ఏపీ సర్కార్.