MRO రమణయ్య కుటుంబానికి రూ.50 లక్షల సాయం ప్రకటించిన AP ప్రభుత్వం

ఏపీలో దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఫ్యామిలీకి భారీగా ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఏపీలో దారుణ హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఫ్యామిలీకి భారీగా ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. బదిలీపై వెళ్లి విజయనగరంలో విధుల్లో చేరిన గంటల వ్యవధిలోనే రమణయ్య హత్యకు గురికావడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన మురారి సుబ్రమణ్యంను చెన్నైలో అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా.. హత్యకు గురైన రమణయ్య కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఫ్యామిలీకి భారీ మొత్తం పరిహారం ఇవ్వడమే కాక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

కొన్ని రోజుల క్రితం విశాఖలో హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన ఫ్యామిలీకి 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటికే స్థానిక మంత్రులు రమణయ్య కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

విజయనగరంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తోన్న రమణయ్య ఐదు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ట్రాన్సఫర్‌ మీద విజయనగరం వెళ్లి.. విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ట్రాన్స్‌ఫర్‌ తర్వాత.. విజయనగరంలో తొలిరోజు విధులు నిర్వహించి.. తిరిగి తన స్వస్థలం విశాఖకు చేరుకున్నాడు రమణయ్య. అదే రోజు రాత్రి పది గంటల సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు.

ఎమ్మార్వో రమణయ్యపై దాడి చేసి.. హత్య చేసిన వ్యక్తిని మురారి సుబ్రమణ్యంగా గుర్తించారు పోలీసులు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మార్వో రమణయ్యపై దాడి చేసిన తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు మురారి విశాఖలోనే ఉన్నాడు. ఆ తర్వాత మారు పేరుతో చెన్నై పారిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు రమణయ్య, నిందితుడు మురారీ మధ్య రిలయ్‌ ఎస్టేట్‌కు సంబంధించిన సమస్యలున్నట్లుగా పోలీసులు విచారణలో తేలింది. అంతేకాక మురారీపై గతంలోనూ హైదరాబాద్, విజయవాడలో ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

Show comments