iDreamPost
android-app
ios-app

APSRTC ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక దానికి లైన్ క్లియర్

  • Published Dec 08, 2023 | 9:28 AM Updated Updated Dec 08, 2023 | 9:28 AM

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. తాాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో.. వారి సమస్యల పరిష్కాారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంతకు దేని గురించి అంటే..

ఆంధ్రప్రదేశ్ లోని ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. తాాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో.. వారి సమస్యల పరిష్కాారానికి లైన్ క్లియర్ అయ్యింది. ఇంతకు దేని గురించి అంటే..

  • Published Dec 08, 2023 | 9:28 AMUpdated Dec 08, 2023 | 9:28 AM
APSRTC ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక దానికి లైన్ క్లియర్

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. నవ రత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పాలన అందివ్వడమే కాక రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అలానే రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి మేలు చేకూరేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా వారి సమస్యలను పరిష్కరిస్తూ.. డిమాండ్లను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ సర్కార్.. తాజాగా వారికి శుభవార్త చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి జగన్ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీచేసింది.

ఆర్టీసీ సంస్థ.. ప్రభుత్వంలో విలీనానికి ముందున్న విద్యార్హతల ప్రకారం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అన్ని విభాగాల్లో వివిధ కేడర్లలోని అధికారులు, ఉన్నతాధికారులకు సంబంధించిన ఉత్తర్వులను గత వారమే జారీచేయగా.. తాజాగా కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఇతర శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వీరికి కూడా పదోన్నతులు కల్పించడానికి ఇబ్బందులు వచ్చాయి.

గతంలో తక్కువ విద్యార్హతలతోనే డ్రైవర్‌, మెకానిక్‌ వంటి అనేక పోస్టుల్లో ఆర్టీసీలో ఉద్యోగాలు పొందారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో.. తక్కువ విద్యార్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వ నిబంధనలు ఆటంకంగా మారాయి. దీంతో విలీనానికి ముందున్న పాత విద్యార్హతల ప్రకారమే పదోన్నతులు కల్పించేలా సర్కారు ఆదేశాలిచ్చింది. దీనిపై సీఎం, సీఎస్‌, ఆర్టీసీ ఎండీకి ఎంఎన్‌యూఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో.. సంస్థ ప్రభుత్వంలో విలీనం చేయకముందు అనగా.. 2020, జనవరి 1 కంటే ముందు నుంచి గతంలో అమలు చేసిన ఆర్టీసీ సర్వీస్‌ నిబంధనలనే వర్తింపజేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు పీటీడీ సర్వీసు నిబంధనల్లోని సెక్షన్‌ 5ను సవరించారు. ఆర్టీసీలో ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి.. గతంలో విద్యార్హతల నిబంధనలు వారికి ప్రత్యేకంగా ఉండేవి.

అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలనే.. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేశారు. దీంతో తాము నష్టపోతామని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వారి అభ్యర్థనలు విన్న జగన్ సర్కార్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేనాటికి ఉద్యోగులుగా ఉన్నవారికి.. పదోన్నతుల విషయంలో సంస్థ సర్వీసు నిబంధనల మేరకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis