iDreamPost
android-app
ios-app

APలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఇకపై వారంతా ప్రభుత్వ ఉద్యోగులే!

  • Published Jul 27, 2023 | 9:34 AM Updated Updated Jul 27, 2023 | 9:34 AM
  • Published Jul 27, 2023 | 9:34 AMUpdated Jul 27, 2023 | 9:34 AM
APలో వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఇకపై వారంతా ప్రభుత్వ ఉద్యోగులే!

ఏపీలో కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. మృతి చెందిన ఉద్యోగుల వారసుల కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్య నియామకాల్లో భాగంగా అర్హులైన అభ్యర్థులను గ్రామ, వార్డు సచివాలయాల్లో పలు విధుల్లో నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా సమయంలో సేవలు అందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యుల్లో ఇప్పటి వరకు 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,488 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరో 1,149 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీరికి ఆగస్టు 24 కల్లా నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కారుణ్య నియామకాలు చేపట్టే సమయంలో అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్‌ రోస్టర్‌ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆదేశించారు. అభ్యర్థుల అర్హతలను బట్టి వారిని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వివిధ శాఖాల్లో ఉన్న ఖాళీల్లో వారిని నియమించాలని ఆదేశించారు. అంతేకాక కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాక సమ్మతి నివేదికను సెప్టెంబర్‌ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మృతిచెందిన ఉద్యోగికి మైనర్‌ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా అభ్యర్థులు ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాల్సి ఉంటుంది.ల్