తాకట్టులో సచివాలయం.. పూర్తిగా అవాస్తవం.. వారిపై చర్యలు: APCRDA

జగన్‌ సర్కార్‌పై విషప్రచారానికి విపక్షాలు ముందుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తాకట్టులో సచివాలయం అని అసత్య ప్రచారానికి దిగాయి. దీనిపై ఏపీసీఆర్‌డీఏ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

జగన్‌ సర్కార్‌పై విషప్రచారానికి విపక్షాలు ముందుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తాకట్టులో సచివాలయం అని అసత్య ప్రచారానికి దిగాయి. దీనిపై ఏపీసీఆర్‌డీఏ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్‌ సర్కార్‌ ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు కట్టుబడి ఉంది.. ఆ దిశగానే చర్యలు తీసుకుంటుంది. 57 నెలల పాలనలో.. సుమారు 98 శాతం హామీలను నెరవేర్చారు సీఎం జగన్‌. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారు. ఇక విద్య, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలవడమే కాక.. విదేశాల ప్రముఖులు సైతం ప్రశసంలు కురిపిస్తున్నారు. ఇక జగన్‌ సంక్షేమ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారని.. రానున్న ఎన్నికల్లో వైసీపీదే విజయం అని సర్వేలన్ని నొక్కి చెబుతున్నాయి. దాంతో ఇప్పటికే ఓటమి భయంతో వణికిపోతున్న విపక్షాలు.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి చిన్న పనిని రాద్ధాంతం చేస్తూ.. అసలు విషయం చెప్పకుండా.. అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

రుషికొండ బిల్డింగ్‌ల నిర్మాణంలో ఇలానే అసత్య ప్రచారినికి దిగగా.. ఒక్క నిర్ణయంతో వారికి షాక్‌ ఇచ్చారు జగన్‌. ఆ విషయంలో అసలు నిజాలు జనాలకు తెలియడంతో.. దాన్నుంచి వారిని డైవర్ట్‌ చేయడం కోసం తాకట్టులో సచివాలయం అనే మరో విషప్రచారానికి దిగారు విపక్ష నేతలు, వారి అనుకూల మీడియా. ఎంతకు దిగజారారు అంటే.. జగన్‌ ప్రభుత్వం.. రూ.370 కోట్లకు సచివాలయాన్ని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు రాసిచ్చింది అంటూ జోరుగా ప్రచారం చేయసాగారు. ఆఖరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది అంటూ విషప్రచారం ప్రారంభించారు. అయితే అది వాస్తవం కాదని తేలింది. దీనిపై స్పందించిన ఏపీసీఆర్‌డీఏ.. ఓ ప్రకటన విడుదల చేసి విపక్షాలది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది.

కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చిన తాకట్టులో సచివాలయం వార్త పూర్తిగా అవాస్తవం అని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఏపీసీఆర్‌డీఏ) స్పష్టం చేసింది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఇటువంటి ప్రతిపాదన ఏది తమ దగ్గరకు రాలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు ప్రైవేట్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీకి తాకట్టు పెట్టినట్లు మీడియా సంస్థలు రాసుకొచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని ఏపీసీఆర్‌డీఏ స్పష్టం చెప్పింది. అంతేకాక ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుంచి ఏపీసీఆర్‌డీఏ ఎలాంటి రుణాలు తీసుకోలేదని ఆ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి. శ్రీనివాస రావు స్పష్టం చేశారు.

రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్‌ 32 ప్రకారం 2018లో కన్సార్టియం బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకులు రూ. 2060 కోట్లు మంజూరు చేశాయని.. అందులో కేవలం రూ. 1955 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేయడం జరిగిందని ప్రకటనలో వెల్లడించారు. అలానే 2017 సంవత్సరంలో మౌలిక వసతుల కల్పన కోరకు హడ్కో రూ.1275 కోట్ల రుణాన్ని మంజూరు చేసిందని.. అందులో నుంచి రూ.1151 కోట్లు మాత్రమే  రిలీజ్ అయిందని వివరించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ కూడా జారీ చేసిందని ప్రకటనలో చెప్పుకొచ్చారు. అంతేకాక ఏపీసీఆర్‌డీఏ భవనాలను తాకట్టు పెట్టి ఎలాంటి రుణాలు పొందలేదని.. ఇలాంటి తప్పుడు, నిరాధారమైన వార్తను ప్రచురించినందుకు సదరు మీడియా సంస్థపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Show comments