P Krishna
ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద ప్రజలకు జగన్ సర్కార్ ఎన్నో రకాల పథకాలు అమలు పరుస్తున్నారు. మహిళా సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా డబ్బులను అకౌంట్ లో జమచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిరుపేద ప్రజలకు జగన్ సర్కార్ ఎన్నో రకాల పథకాలు అమలు పరుస్తున్నారు. మహిళా సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా డబ్బులను అకౌంట్ లో జమచేస్తున్నారు.
P Krishna
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తండ్రి ఆశయాలు సాధించేదిశగా ప్రజా పాలన కొనసాగిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలు అమలు చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇటీవల వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకాల ద్వారా మహిళలకు డబ్బులు అకౌంట్ లో జమచేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఏపీ మహిళలకు శుభవార్త.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అర్హులైన మహిళలకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. కర్నూల్ జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో సీఎం జగన్ దీనికి సంబంధించిన బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం ద్వారా రూ.15 వేలు అకౌంట్ లో జమ అవుతున్న విషయం తెలిసిందే. 45 నుంచి 60 ఏళ్ల మద్య వయస్కు మహిళల ఈ పథకానికి అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ.12 వేలు ఆదాయం మాత్రమే ఉండాలి. అలాగే కుటుంబానికి మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా పది ఏకరాల పొడి భూమి కానీ, తడి భూమి కానీ ఉండాలి.
ఈ పథకానికి కావలసిని అర్హత, డాక్యుమెంట్స్ ఎంటో చూద్దాం.. కుటుంబానికి 4 వీలర్ (ఆటో, ట్యాక్సీ, ఇతర వాహనాలు) ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఇన్‌కం ట్యాక్స్ కట్టకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేదా మున్సిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు. ఏపీ సేవా ద్వరా తీసుకున్న ఆదాయ, కుల, ధృవీకరణ పత్రాలు అందజేయాలి. వయసు ధృవీకరణ (ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదా టెన్త్ మార్క్ మెమో తో పాలు ఓటర్ ఐడీ కార్డు) అందజేయాలి. ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెల్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్… ఎన్‌పీసీఐ రన్నింగ్ లో ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ దారుగా ఉండకూడదు. ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.