P Krishna
P Krishna
గత కొన్నిరోజులుగా ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఐటీ నోటీసులు జారీ చేయడంప తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రూ. 118 ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఐటీ స్కామ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ స్కామ్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఐటీ స్కామ్, స్కిల్ స్కామ్ లో మూలాలు ఒకే చోటు ఉన్నట్టు గుర్తించింది ఏపీ సీఐడీ. ఈ రెండు స్కాముల్లో ఒకే వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తిగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, స్కీల్ స్కామ్ లో నిందితులుగా ఉన్న యోగేష్ గుప్తలకు సీఐడీ నోటీసులు ఇచ్చింది.
టిడ్కో ఇళ్ల నిర్మాణ సమయంలో రేట్లు పెంచి ముడుపులు తీసుకున్నారనేది చంద్రబాబు పై ఉన్న ఆరోపణలు. నాలుగేళ్లుగా కేంద్ర ఆదాయపన్ను విచారణ చేస్తుంది. మరోవైపు ఇదే వ్యక్తులు స్కిల్ స్కామ్ లో ఉన్నట్లు గా ఏపీ సీఐడీ భావిస్తుంది. ఈ రెండు స్కాముల్లో డబ్బు చేరింది ఒకే వ్యక్తికి అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. వీటికి సంబంధించిన దుబాయ్ నుంచి కూడా చంద్రబాబు డబ్బు అందుకున్నట్లు గా అభియోగాలు ఉండటంతో త్వరలో దుబాయ్ కి కూడా వెళ్లబోతుంది విచారణ బృందం. గత నాలుగేళ్లుగా దీనికి సంబంధించి చంద్రబాబు కు ఐటీ నోటీసులు పంపిస్తున్నప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో ఇక సీఐడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.
ఐటీ, స్కిల్ స్కామ్ లో నింధితులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేష్ గుప్తలను సీఐడీ పిలిచి విచారించున్నట్లు తెలుస్తుంది. ఇక రెండు స్కాముల్లో డబ్బు తీసుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్కిల్ డెవలప్ మెంట్ కేసును డీల్ చేస్తున్న సీఐడీ ఇక ముందు ఐటీ స్కామ్ పై కూడా విచారణ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి ముందు ముందు ఈ కేసు విషయం ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి ఐటీ స్కామ్ విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచడంతో రాజకీయంగా చర్చలు కొనసాగుతున్నాయి.