iDreamPost
android-app
ios-app

AP రైతులకు శుభవార్త.. డబ్బుల విషయంలోమరో అవకాశం!

YSR Rythu Bharosa: ఏపీ ప్రభుత్వం రైతుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా సాయం అందని వారికి మరో అవకాశం కల్పించింది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు.

YSR Rythu Bharosa: ఏపీ ప్రభుత్వం రైతుల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా సాయం అందని వారికి మరో అవకాశం కల్పించింది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు.

AP రైతులకు శుభవార్త.. డబ్బుల విషయంలోమరో అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు భరోసా వంటి స్కీమ్స్ తో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా సాయం అందని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో ఛాన్స్ కల్పించింది. సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఈ నెల 30 వరకు దరశాస్తుకు అవకాశం కల్పించారు. వీరికి విడతల సాయం ఒకేసారి అందిస్తారు. కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఆంధ్రప్రదేశ్ లోని కౌలు రైతులకు, అటవీ భూమి సాగు చేసుకునే వారికి జగన్ సర్కార్  శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం దక్కని రైతులకు మరో ఛాన్స్ కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతు భరోసా సాయం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.  అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సాయం అందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, వారితో పాటు అటవీ భూ సాగుదారులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన మూడో విడత సాయంతో కలిపి ఈ ఏడాది రైతుభరోసా అందించే పనిలో వ్యవసాయ శాఖ ఉంది.

ఈ నెల  30 తేదీ వరకు రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేసుకునేందుకు అధికారులు ఛాన్స్ కల్పించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవదాయ, అటవీ భూమిని సాగు చేసే వారితో పాటు సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకుప్రతి ఏటా మూడు విడుతల్లో రూ. 13 వేల 500 చొప్పున పెట్టుబగడి సాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. వైఎస్సార్ రైతు భరోసా అందుకుంటున్న వారిలో  భూ యజమానులు 51 లక్షల మంది, పాస్ బుక్ ఆధారంగా 1.2 లక్షల మంది కౌలు రైతులు, ఆర్వో ఎఫ్ఆర్ పట్టాతో అటవీ భూమి సాగు చేసుకుంటన్న వారు 90 వేల మంది ఉన్నారు.

ఈ నాలుగున్నరేళ్లలో కౌలురైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ సాగుదారులు మొత్తం 9.39 లక్షల మందికి రూ.1,219.68 కోట్ల పెట్టుబడి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం అందించింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,147.72 కోట్ల పెట్టుబడి సాయం అందించారు.  వచ్చే ఏడాది జనవరిలో మూడో విడత వైఎస్సార్ రైతు భోరసా సాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరికొందరు కౌలుదారులు, అటవీ భూ సాగుదారులకు లబ్దిచేకూర్చాలని రైతుభరోసా పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించారు.

రెండో విడత సాయం పంపిణీ తర్వాత లాక్‌  అయింది. దీంతో ఈ పోర్టల్‌ లాగిన్‌ను ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం అధికారులు మళ్లీ ఓపెన్‌ చేశారు. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఈ నెల 30వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో మూడు విడతల సాయం ఒకేసారి అందిస్తారు. మరి… ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.