Dharani
సోషల్ మీడియా వేధింపులకు బైలన గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సోషల్ మీడియా వేధింపులకు బైలన గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
Dharani
జగన్ ప్రభుత్వ పథకాలను పొగిడినందుకు.. సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడి.. తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న ఏపీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. గీతాంజలిని ట్రోల్ చేసిన వారి భరతం పట్టే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గీతాంజలి కేసులో పోలీసులు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న రాంబాబు.. సోషల్ మీడియా వేదికగా గీతాంజలిపై అసభ్యకర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ కొన్ని రోజుల క్రితం మృతురాలు గీతాంజలి ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయ్యింది. అయితే దీనిపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అసభ్యకరమైన పదజాలంతో ఆమెని దూషించారు. ఓ సామాన్య మహిళపై తమ అక్కసు మొత్తం కక్కారు. వారి వేధింపులు తాళలేక.. గీతాంజలి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దారుణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆమె కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు సీఎం జగన్. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ చట్టం వదిలిపెట్టదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు.
ఇక గీతాంజలి మరణంపై టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ సైతం స్పందించారు. మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ‘గీతాంజలికి న్యాయం జరగాలి. ఆమె విషయంలో అసలేం జరిగింది. ఎందుకు గీతాంజలి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది.. ఒక పార్టికి చెందిన సోషల్ మీడియా ట్రోలర్స్ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా.. అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. ఆ పసి పిల్లలు (గీతాంజలి బిడ్డలు)కు న్యాయం చేయండి’ అని ట్వీట్ పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.