Dharani
ఏపీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో సీఎం జగన్ నేడు పులివేందులలో పర్యటించారు. నామినేషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు..
ఏపీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ క్రమంలో సీఎం జగన్ నేడు పులివేందులలో పర్యటించారు. నామినేషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుంది. ఎలక్షన్స్‌లో కీలకమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలు నామినేషన్ దాఖలు చేయగా.. ఇంకా చేయని వారికి నేడు అనగా గురువారం మధ్యాహ్నం వరకు గడువు ఉంది. ఆ తర్వాత నామినేషన్ వేయడానికి అవకాశం లేదు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పులివెందులలో తన నామినేషనక్ దాఖలు చేశారు. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. ఆ వివరాలు..
ఈ క్రమంలో సీఎం జగన్ గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్‌లోని ఆర్వో ఆఫీస్‌కు వెళ్లి అక్కడి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందులలో ‘జై జగన్’ నినాదాలతో దద్దరిల్లింది.
స్థానిక సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. ‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ.. నా ప్రాణానికి ప్రాణం.. పులివెందుల అంటే నమ్మకం,ధైర్యం.. పులివెందుల అంటే ఒక అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ.. కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణానది నీళ్లు తీసుకొచ్చాం..’’ అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు, మిగతా వారిపై ఘాటుగా విమర్శలు చేశారు జగన్.
వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతలపై సీఎం జగన్ మండిపడ్డారు. తన చిన్నాన్న వివేకాను చంపిన వాళ్లెవరో జనాలకి తెలుసని.. కానీ కావాలనే కొందరు అవినాష్‌రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దివంగత వైఎస్సార్‌పై కుట్రలు చేసినవాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని అన్నారాయన. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని తెలిపారు.