iDreamPost
android-app
ios-app

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

AP Government: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాల ప్రజలకు తరచూ గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

AP Government: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని వర్గాల ప్రజలకు తరచూ గుడ్ న్యూస్ చెబుతుంటారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంటారు. నవరత్నాల పేరుతో ఎంతో సంక్షేమ పథకాలను చేపట్టి, ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా తరచూ వివిధ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతుంటారు. ఇలా కేవలం ప్రజలకే కూకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అనేక  శుభవార్తలు చెప్పారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు  శుభవార్త చెప్పింది. ఆ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.  ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. అందులో ఈ నెల 15వ తేదీ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. అలానే సంక్రాంతి లోపు అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖకు చెందిన అధికారులు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చేరంటే.. చేస్తారనే విషయం మనందరికి తెలిసిందే.

అందుకు నిదర్శనంగా ఇప్పటికి అనేక ఘటనలు మన కళ్ల ముందే జరిగాయి. ఆయన మాట ఇచ్చారంటే.. ఆ మాటను నిలబెట్టుకుంటారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలోనూ అదే చేశారు. చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ వారి జీవితాలలో సీఎం జగన్ వెలుగు నింపారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరి.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్ లైన్స్ ను ఆర్థిక శాఖ విడుదల చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.