iDreamPost
android-app
ios-app

జగనన్న తోడు నిధులు విడుదల.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

జగనన్న తోడు నిధులు విడుదల.. సీఎం  జగన్ కీలక వ్యాఖ్యలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు నవరత్నాల పేరుతో ఆర్థిక భరోసాతో పాటు, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండిటిని జోడెద్దుల పరుగులు పెట్టిస్తున్నారు. వివిధ రకాల పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ.. వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  ఇప్పటికే పలు పథకాల రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాల్లో జగనన్న తోడు ఒకటి. ఇది చిరు వ్యాపారులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ప్రారంభించారు. ఇప్పటికే  ఆరు విడతలుగా నగదు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం మంగళవారం నాలుగో ఏడాది కూడా విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో  నిధుల విడుదల కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదలకు మంచి జరిగే ఈ యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోందన్నారు.

మంగళవారం   తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నాలుగో ఏడాది  51 లక్షల మందికి 510 కోట్ల రూపాయల రుణాలు విడుదల చేశారు.  ఇక జగనన్న తోడు ఏడో విడత కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ..” దేశంలోని ఏ రాష్ట్రంలో ఎక్కడా  ఇన్ని లక్షల మందికి ఈ విధంగా మంచి చేయడం లేదు. ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు ఎక్కడా ఇంత మేలు జరగడం లేదు. ఈ పథకాన్ని ఎంతో చక్కగా నడుపుతున్న బ్యాంకర్లు, సచివాలయాల వ్యవస్థ, మెప్మా.. తదితర శాఖల అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. పేదవాడికి మంచి చేయాలని తలపెట్టిన ఈ యజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు 15.87 లక్షల మంది చిరువ్యాపారులకు మేలు జరిగింది. చిరు వ్యాపారులు సమాజా సేవ చేస్తున్నారు.

అవకాశం  వస్తే మరికొందరికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు.  ఈ పథకం  హస్తకళాకారులకూ, చేతివృతుల వారికీ పథకం వర్తిస్తోంది. రూ.10వేల రుణంతో  ఈ కార్యక్రమం మొదలై.. క్రమం తప్పకుండా చెల్లించే వారికి  వెయ్యి.. వెయ్యి పెంచుకుంటూ  రూ.13 వేల వరకూ ఇవ్వమని చెప్పాం. పాదయాత్రలో వారి కష్టాలను కళ్లారా చూశాను. వారితో కలిసి మాట్లాడటం జరిగింది.  ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఈ పథకం వర్తించకుంటే.. వెంటనే సచివాలయంలో సంప్రదించండి.  ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే మన ప్రభుత్వం తపన పడుతోంది” అని సీఎం జగన్ అన్నారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి