సీఎం మంచి మనసు..అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక సాయం!

సీఎం మంచి మనసు..అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక సాయం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ప్రజా ఆరోగ్యంగా కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇలా కేవలం ఆరోగ్యశ్రీ ద్వారానే కాకుండా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి సీఎం జగన్ ఆర్థిక సాయం చేశారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా.. తాజాగా విశాఖ పర్యటనలో మరోసారి కనిపించింది. సీఎం జగన్ మంచి మనస్సుకు అందరు ఫిదా అయ్యారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సీఎం జగన్ ను కలిసి తమ బాధను వివరించారు. దీంతో వారిని వెంటనే ఆదుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం విశాఖపట్నంలో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహేజా గ్రూప్స్ ఇనార్భిట్ మాల్ కు భూమి పూజ చేశారు. విశాఖలోని కైలాసపురంలో నిర్మిస్తున్న  ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం అక్కడ వివిధ రకాల అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న వారిని సీఎం కలిశారు. పెద వాల్తేర్ కు చెందిన కె. రమేష్ (11)ని సీఎం జగన్ పలకరించారు. తన కుమారుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వైద్య సేవల నిమిత్తం ఆర్థిక సహాయం చేయమని బాధితుడి తల్లి కె. లక్ష్మి కోరింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం జగన్.. వైద్యం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

అదే విధంగా మోహన్(17) ను  అనే మరో బాధితుడిని సీఎం జగన్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.పెందుర్తి మండలం వేపగుంటకు చేందిన వీరవల్లి మోహన్ తాను 4వ అంతస్తూ నుండి పడిపోయానని, వెన్నపూస దెబ్బ తిన్నదని ఆరోగ్య శ్రీ లో వైద్యం పొందినట్లు తెలిపారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో నయం కాలేదని, వైద్య సేవల నిమిత్తం సీఎంను ఆర్థిక సాయం చేయమని కోరారు. దీంతో ఫిజియో ధెరపి  వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించాలని సీఎం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందినప్పటికి మానవత్వంతో సీఎం జగన్ బాధితుడికి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. అలానే

కంచరపాలెంలోని బాపూజీనగర్ కు చెందిన ఢిల్లీశ్వరరావు(9) పుట్టుకతో ఆర్దోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడు. తమ కుమారుడి కాపాడాని ఢిల్లీశ్వరరావు తల్లి..సీఎంను కోరారుముఖ్యమంత్రికి తెలిపారు. వారి సమస్యను  విన్నసీఎం జగన్.. గవిడి ఢిల్లీశ్వరరావుకి వైద్య సేవలు నిమిత్తం ఆర్థిక సహాయం చేయాల్సిందిగా జిల్లా ఆదేశించారు. ఇలా సీఎం ఆదేశాలతో బాధితులకు వైద్య సేవలు నిమిత్తం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.  ఇలా పేదలను ఆదుకుంటూ సీఎం జగన్ మానవత్వం చాటుకున్నారు. మరి.. ఇలా ఆదుకోండంటూ వచ్చిన పేదలకు సీఎం చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండిఇనార్బిట్‌ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి.. విశాఖ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్‌

Show comments