చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన CM జగన్!

శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్.

శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉంటాయి. అధికార, ప్రతిపక్షాలు  ఓ రేంజ్ లో మాటల యుద్ధానికి దిగుతుంటారు. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ హీట్ మరింత ఎక్కువైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం పనిగా పెట్టుకున్నారు. పాలన పరమైన లోపాలను ఎత్తి చూపడంలో విఫలమైన ఈ నేతలిద్దరు.. జగన్ ను వ్యక్తిగతంగా మాత్రమే విమర్శిస్తున్నారు. అయితే వాళ్లకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఈ రోజు నూజివీడులో జరిగిన సభలో సీఎం జగన్.. చంద్రబాబుకు అదిరిపోయే  కౌంటర్ ఇచ్చారు.

గిరిజనుల గోడును ఆలకించి.. నేను ఉన్నానంటూ భరోసా కల్పించిన సీఎం జగన్ పోడు భూములకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా పట్టాలిచ్చి రికార్డు సృష్టించారు. గిరిజినులకు పోడు భూముల పంపిణీ దేశంలోనే ఏపీని ఆదర్శంగా నిలిపారు. శుక్రవారం భారీ భూ పంపిణీ కార్యక్రమానికి నూజివీడు వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లాలోనే  10,300 మందికి  12,8886 ఎకరాల భూమిని శాశ్వత హక్కతో అందించారు.  అదే విధంగా  31 గ్రామాల్లో ఎస్సీ శ్మశానా వాటికలకు 33.32 ఎకరాలను ఇదే వేదిక నుంచి మంజూరు చేశారు.

ఇక నూజివీడు సభలో సీఎం జగన్.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. అంతేకాక బాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు సీఎం కాలేదని, ఆయనకు మంచి చేద్దామనే ఆలోచనలే లేదని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీనేనని, బాబు హయాంలో అందరినీ మోసం చేశాడని అన్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్దాలతో వస్తారని.. ప్రతి ఒక్కరూ  జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాని సీఎం జగన తెలిపారు.

ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..” చంద్రబాబు తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్దం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చాడు. బాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయ ఉందో గుర్తుకు తెచ్చుకోండి. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు అన్నారు. ఇక ఇచ్చిన మేనిఫెస్టోపై కమిట్ మెంట్ లేని నాయకుడు చంద్రబాబు. కోడలు మగ పిల్లాడ్ని కంటానంటే.. అత్త వద్దంటుందా అని అన్నది చంద్రబాబే. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు. ఎన్నికలు దగ్గర పడేకొద్ది తోడేళ్లు అందరూ ఏకమవుతారు. ప్రజల దీవెనలు ఉన్నంత వరకూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోను. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదు” సీఎం జగన్ పేర్కొన్నారు. మరి.. చంద్రబాబు నాయుడిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments