Dharani
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీఐడీ అధికారులు టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీఐడీ అధికారులు టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలు..
Dharani
చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన తర్వాత.. ఆ తీర్పు వెల్లడించిన సదరు న్యాయమూర్తి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. చాలా మంది ఇలాంటి హై ప్రొఫైల్ కేసులో ఎంతో ధైర్యంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించారని ఆ జడ్జిని ప్రశంసించారు. ఈ తీర్పు వల్ల చట్టం ముందు అందరూ సమానమే అని మరోసారి నిరూపితం అయ్యిందంటూ కామెంట్స్ చేశారు. కానీ ఈ తీర్పును జీర్ణించుకోలేకపోయిన పచ్చ నేతలు మాత్రం.. సదరు న్యాయమూర్తి మీద విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగాంగా.. సీఐడీ అధికారులు.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసులు అందజేశారు. న్యాయమూర్తులను దూషించారన్న అభియోగాలపై ఈ నోటీసులు ఇచ్చారు. స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత.. నాయ్యమూర్తుల మీద విమర్శలు పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. దానిలో భాగంగానే సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌లో ఉన్న బుద్దా వెంకన్న వద్దకు వెళ్లి నోటీసులు అందజేశారు. దీనికి వెంటనే తగిన సంజాయిషీ ఇవ్వాలని తెలిపారు.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో భాగంగా.. చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా జ్యుడిషయల్ రిమాండ్ విధించారు. అనంతరం ఈ తీర్పు వెల్లడించిన జడ్జిపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన ఓ లాయర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయగా.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. విచారణ జరిగింది. నోటీసులు జారీ చేసి కోర్టు విచారణ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో బుద్దా వెంకన్న పేరు కూడా ఉండటంతో తాజాగా సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది.