ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక కేసును విచారిస్తున్న ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మరో 7 అరెస్ట్ లు ఉంటాయని తాజాగా ఆయన ప్రకటించారు. ఏపీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, త్వరలోనే మరో 7 అరెస్ట్ లు ఉంటాయని సంజయ్ తెలిపారు. దీంతో ఆ ఏడుగురు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోందని, ఈ కేసులో ఇప్పటికే సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్, స్కిల్లర్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఆర్థిక సలహాదారుడు ముకుల్ చంద్ర అగర్వాల్, సీఏ సురేష్ గోయెల్ ను అరెస్ట్ చేశారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు స్కిల్ స్కామ్ కు సంబంధించి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి సంజయ్ మాట్లాడారు. ఇక ఈ కుంభకోణంలో 13 డిజిటల్ సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడిని ఆధారాలతో సహా అరెస్ట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
కాగా.. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని సంజయ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆ ఏడుగురు ఎవరు? అంటూ రాష్ర్ట ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నారా లోకేష్ భార్య బ్రాహ్మణి తన భర్తను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే బ్రాహ్మణి నోటి నుంచి అరెస్ట్ మాట వచ్చిన రెండు రోజులకే సీఐడీ అధికారి నుంచి కూడా అరెస్ట్ మాట రావడంతో.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఇక ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ రావడం కూడా కష్టమే అని తెలుస్తోంది. మరి సీఐడీ డీజీ సంజయ్ అన్నట్లుగా మరో 7 అరెస్టుల్లో ఎవరెవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.