Dharani
టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరిని.. ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
టీడీపీ ఎన్నారై నేత యశ్ బొద్దులూరిని.. ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి వచ్చిన యశ్ ని.. హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అతడిని అరెస్ట్ చేసి మంగళగిరి తరలించారు. టీడీపీ ఎన్ఆర్ఐ నేత యశ్ మీద లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యశ్ బొద్దులూరి ఇండియా వస్తున్నట్లు తెలుసుకున్న సీఐడీ అధికారులు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఈక్రమంలో అతడు విమానాశ్రయం బయటకు రాగానే అరెస్ట్ చేశారు. అయితే, యష్ ని అదుపులోకి తీసుకునే సమయంలో ఇది అరెస్ట్ కాదని ఏపీ సీఐడీ తెలిపింది. యశ్ ని అరెస్ట్ చేయమని లుకౌట్ నోటీసులు ఉండడం వల్లే తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అతడిని మంగళగిరి తరలిస్తున్నట్లు వెల్లడించారు సీఐడీ అధికారులు.
ఎన్నారై అయిన యశ్.. తరచుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన మీద, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తరచుగా విమర్శలు చేసేవాడు. ఈ క్రమంలో ఓసారి సీఎం జగన్‌ను ఉగ్రవాదితో పోల్చి.. వారిలాగానే జగన్ ఆలోచనలు కూడా ఉంటాయని.. ఉగ్రవాదులకు జగన్‌కు పెద్దగా తేడా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగక.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాదు.. జగన్ తన తండ్రిని చంపేసి సీఎం అవ్వాలని భావించాడని.. తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపైనే సీఐడీ పోలీసులు కొన్నాళ్ల కిందట కేసులు నమోదు చేశారు. ఇక తాజాగా అతడు ఇండియా రావడంతో అదుపులోకి తీసుకున్నారు.
లుకౌట్ సర్క్యులర్, లుకౌట్ నోటీసు రెండూ ఒకటే. భారతీయ అధికారులు.. అంతర్జాతీయ సరిహద్దులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, సముద్ర ప్రాంతాలు, ఓడరేవులు మొదలైన వాటి వద్ద వాంటెడ్ వ్యక్తులు, నేరస్థులను అదుపులోకి తీసుకోవడానికి ఈ నోటీసులు అనుమతిస్తాయి. పరారీలో ఉన్న నేరస్థులను అదుపులోకి తీసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, అధికారులు ఆశించే వ్యక్తులు దేశంలోకి ప్రవేశిచకుండా, వారిపై నిఘా వేయడానికి ఈ నోటీసులను జారీ చేస్తారు. దీనికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను (భారత పౌరులకు సంబంధించి లుకౌట్ సర్క్యులర్ నోటీసు ప్రచురణకు సంబంధించి) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ) జారీ చేస్తుంది.