అత్యుత్సాహంతో గాజు గ్లాస్ డైలాగ్.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే?

AP CEO- Pawan Kalyan: సాధారణంగా పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం సినిమాలను వాడుతూ ఉంటారని అందరికీ తెలిసిందే. తాజాగా అదే పని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో చేశారు. దానిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి స్పందించారు.

AP CEO- Pawan Kalyan: సాధారణంగా పవన్ కల్యాణ్ ఎన్నికల కోసం సినిమాలను వాడుతూ ఉంటారని అందరికీ తెలిసిందే. తాజాగా అదే పని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో చేశారు. దానిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎవరికి వాళ్లు ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అధికారి వైసీపీ పార్టీ తాము చేసిన సంక్షేమంతో ప్రజల్లోకి వెళ్తుంటే.. ప్రతిపక్ష కూటమి మాత్రం లేనిపోని అత్యుత్సాహం చూపించి చిక్కుల్లో పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. తాజాగా పవన్ కల్యాణ్ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. దానిలో గాజు గ్లాస్ డైలాగ్ ఉంది. హరీశ్ శంకర్- పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో ఆ డైలాగ్ పెట్టారో గానీ.. ఇప్పుడు దాని వల్ల పవన్ కు తిప్పలు తప్పేలా లేవు. ఎందుకంటే ఎన్నికల అధికారులు దానిని కూడా ప్రచారం కింద భావిస్తే మాత్రం అది కచ్చితంగా సమస్య అయ్యే అవకాశం ఉంది.

విషయం ఏంటంటే.. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పేదళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి తాజగా ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఆ గ్లింప్స్ లో యాక్షన్ తో పాటు ఒక డైలాగ్ కూడా ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే.. గాజు గ్లాసుకు సంబంధించింది. పగిలే కొద్ది పదునెక్కుతుంది అని ఉంది. అయితే ఆ డైలాగ్ ఇప్పుడు నెట్టింట పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆ డైలాగ్ కి ఏంటి సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ డైలాగ్ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ స్పందించారు. ప్రచారాల విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎవరు ఎలాగైనా ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అని స్పష్టం చేశారు. కానీ, అందుకు కొన్ని షరతులు ఉంటాయని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ మూవీ గ్లింప్స్ తాను చూడలేదని చెప్పారు. గాజు గ్లాస్ గుర్తు ప్రచారం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కానీ, ఏదైనా మాధ్యమాన్ని వాడుతున్న సమయంలో దానికి తగిన అనుమతులు మాత్రం తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. ఈ గ్లింప్స్ డైలాగ్ కి సంబంధించి పవన్ కల్యాణ్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని.. ఈ విషయాన్ని పరిశీలిస్తామంటూ వ్యాఖ్యానించారు.

ఇంకా డైలాగులేనా?:

పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్, ఆ గ్లాస్ డైలాగ్ చూసిన తర్వాత నెట్టింట భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ పవన్ కల్యాణ్ సినిమాలు, సినిమా డైలాగులతోనే ఓట్లు కొల్లగొట్టాలని చూస్తూ ఉండటం దారుణం అంటున్నారు. పార్టీ పదేళ్లు అయ్యింది, గత ఎన్నికలల్లో రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. కానీ, ఇంకా పవన్ కల్యాణ్ అసలు రాజకీయం అంటే అర్థం కావడం లేదంటున్నారు. రాజకీయం అంటే ప్రజల్లో ఉండటం, ప్రజలకు సేవ చేయడం, వారి మంచికోరి జీవించడం, వారికి భవిష్యత్ మీద ఆశ కల్పించడం అంటున్నారు. అంతేకాకుండా ఒక రాజకీయనాయకుడు మాటిస్తే దాని మీదే నిలబడాలి అంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా కేవలం సినిమా డైలాగులతోనే కాలం గడిపేస్తామంటే మళ్లీ పరాభవం తప్పదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి..  పవన్ డైలాగ్ పై ఎన్నికల అధికారి రియాక్ట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments