Arjun Suravaram
బుధవారం మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే దీని కంటే ముందు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
బుధవారం మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే దీని కంటే ముందు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమైంది. ఆ తరువాత అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాల గురించి వివరిస్తుండగా ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడ్డారు. ఇలా రెండు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కూడా ప్రారంభమయ్యాయి. అయితే బుధవారం అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
తాడేపల్లిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం ఏపీ కేబినేట్ సమావేశం అయ్యింది. అనేక అంశాలపై సుదీర్ఘంగా మంత్రిమండలిలో చర్చలు జరిగాయి. ఈ మీటింగ్ లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి మండలి ఆమోదించింది. ఈ బడ్జెట్ తో పాటు పలు ఇతర నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది.
ఇక ఏపీ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే.. నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టి కల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హార్టికల్చర్ యూనివర్సిటీతో ఈ హార్టీకల్చరల్ పాలిటెక్నికల్ కాలేజీ పనిచేయనుంది. ఇక దీనితో పాటు డోన్ లోని వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లోమా కోర్సుతో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ వ్యవసాయ కళాక్షేత్రం.. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేయనుంది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్-2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రైవేటు యూనివర్సిటీలకు ఏపీ మంత్రి మండలి అనుమతిచ్చింది.
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాజంపేటలో అన్నమాచార్య విశ్వవిద్యాలయం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతిచ్చింది. వీటితో పాటు గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే మంత్రి మండలి సమావేశం అనంతరం అసెంబ్లీలో మధ్యతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. రూ.2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ఆయన ఈ సభకు సమర్పించారు. మరి..ఏపీ మంత్రి మండలి తీసుకున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.