Dharani
AP Assembly Budget 2024-25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన నేడు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం పద్దు ఏంత.. దేనికి ఎంత క ఏటాయించారు అంటే..
AP Assembly Budget 2024-25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన నేడు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం పద్దు ఏంత.. దేనికి ఎంత క ఏటాయించారు అంటే..
Dharani
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 2024-25 సంవత్సరానికి గాను 2,86,389 కోట్ల రూపాయల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తంలో రూ.2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా.. రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 మేర ద్రవ్య లోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని తెలిపారు. అంతేకాక ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించినా.. ఏప్రిల్ నుంచి జూలై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. ఇక పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది అని ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పుకొచ్చారు. సుపరిపాలన, సామార్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర ప్రతిపాదికగా బడ్జెట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. అంతేకాక వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిబద్ధత తమ పాలనలో ప్రతి ఫలించింది అన్నారు బుగ్గన. అంతేకాక అర్థశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్ పాలన సాగింది అని తెలిపారు. 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామన్నారు.
కుప్పం సహా నేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడమే కాక.. ఆరు పోలీస్ స్టేషన్లతో కుప్పం పోలీస్ సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాక ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని బుగ్గన వెల్లడించారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఆక్వా, పోర్టులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు వంటి రంగాల్లో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన పథకాలను ఈ సందర్భంగా వివరించారు మంత్రి బుగ్గన.