P Venkatesh
మహిళలకు భారీ గుడ్ న్యూస్. మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు ఎంచక్కా డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఇంటి వద్ద నుంచే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఎలా అంటే?
మహిళలకు భారీ గుడ్ న్యూస్. మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు ఎంచక్కా డబ్బు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఇంటి వద్ద నుంచే మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఎలా అంటే?
P Venkatesh
పేద వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు రేషన్ కార్డులను జారీ చేస్తుంటాయి. ప్రతి నెల రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇతరత్రా సరుకులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఇదే గాక రేషన్ కార్డుతో మరిన్ని ప్రయోజనాలు కూడా అందుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డుతో ఇన్ని లాభాలు ఉండడం వల్లనే ప్రతి ఒక్కరు రేషన్ కార్డు తీసుకునేందుకు ఇంట్రస్టు చూపిస్తుంటారు. అయితే రేషన్ కార్డు కలిగిన మహిళలకు డబ్బు సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది. రేషన్ కార్డు ఉంటే చాలు ఇంటి వద్ద నుంచే సంపాదించుకోవచ్చు.
మహిళలు మీరు డబ్బు సంపాదించేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు రేషన్ కార్డు కలిగి ఉంటే చాలు సంపాదించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ సదవకాశం లభించింది. అయితే ఇది అందరికి మాత్రం కాదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మహిళలకు మాత్రమే. ఈ జిల్లాలోని మహిళలకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. ఏపీజీబీ బ్యాంక్‌కు చెందిన స్వయం ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మహిళలు వారి కాళ్లపై వారే నిలబడే విధంగా.. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆ సంస్థ జోనల్ డైరెక్టర్ బి. శివప్రసాద్ తెలిపారు.
బ్యూటీపార్లర్ కోర్సు నేర్చుకుంటే మంచి ఆదాయం పొందొచ్చు. ఈ రోజుల్లో అందానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. అదే విధంగా వివాహాలు, ఇతర వేడుకలప్పుడు మరింత డిమాండ్ ఉంటుంది. కాబట్టి బ్యూటీ పార్లర్ కోర్సులో శిక్షణ పొందింతే డబ్బు సంపాదనకు కొదవ ఉండదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని శివప్రసాద్ సూచించారు. కాగా బ్యూటీ పార్లర్ ఉచిత ట్రైనింగ్ జూన్ 19 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.
జూన్ 19వ తేదీ నుంచి 30 రోజులపాటు మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తైన తర్వాత కోర్సు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్ కూడా అందివ్వనున్నారు. అలాగే ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఫోటోలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు, విద్యార్హత ధ్రువపత్రాలతో కల్లూరులోని కెనరా బ్యాంక్ వద్దనున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను సంప్రదించాలని సూచించారు.