iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్.. 15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

  • Published Sep 25, 2024 | 11:21 AM Updated Updated Sep 25, 2024 | 12:23 PM

Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

Ration Cards: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 25, 2024 | 11:21 AMUpdated Sep 25, 2024 | 12:23 PM
తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్.. 15 లక్షల రేషన్ కార్డులు రద్దు?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త రేషన్ కార్డు విధి విధనాలపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ కార్డు లేని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. దీంతో రాష్ట్రంలో చాలా మంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులో కొంత మంది పేర్లు తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని రేషణ్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో.. ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు రాష్ట్రంలో బోగస్ రేషన్ కార్డులు ఏరివేతకోసం ప్రభుత్వం రేషన్ కార్డు దారులను ఈ-కేవైసీ చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ ప్రక్రియలో ఈ కేవైసీ పూర్తి చేసుకోని వారందరినీ అనర్హులుగా గుర్తించినున్నట్లు సమాచారం. అందుకే వారందరికి రేషన్ కార్డులు రద్దు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో ఇకపై రేషన్ కార్డుల జారీలో పకడ్బందీగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి నుంచి సిటిజన్-360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 3.83 కోట్ల జనాభ ఉండగా, అందులో 89.96 లక్షల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి.

ఇకపోతే గతంలో అర్హతలను పూర్తి గా విచారించకుండానే రేషన్ కార్డులను ప్రభుత్వాలు జారీ చేశాయి. దీని వల్ల అనర్హులకు కూడా తెల్ల రేషన్ కార్డులు వచ్చాయి. వ్యక్తులు లేకున్నా వారి పేరు పై రేషన్ కార్డులు ఉన్నాయనే ఆరోపణలు కూడా తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అనర్హులను గుర్తించేందుకు గతేడాది ఆక్టోబర్ నెలలో నుంచి ఈ–కేవైసీ విధానాన్ని చేపట్టింది. అయితే.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు దాదాపు ఆరు సార్లు సమయం పొడిగించింది. అయిన సరే ఈ ప్రక్రియకు ఎవరు పట్టించుకోకపోవడంతో తాజాగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి, తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నట్లు వినిపిస్తున్నసమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.