iDreamPost
android-app
ios-app

ఇది కదా అభివృద్ధి అంటే.. ఐటీ రిటర్న్స్‌లో ఏపీ టాప్‌!

ఇది కదా అభివృద్ధి అంటే.. ఐటీ రిటర్న్స్‌లో ఏపీ టాప్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో నడుస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ పలు విషయాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్నో జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు అభివృద్ధి సూచికగా చెప్పుకునే ఐటీ రిటర్న్స్‌ విషయంలోనూ ఏపీ తన సత్తా చాటింది. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయటంలో ఏపీ టాప్‌లో నిలిచింది.

ఏపీలో ఐటీఆర్‌ దాఖలు శాతం ఏకంగా 81.34గా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఐటీఆర్‌ దాఖలు చేయటం ఇదే మొదటిసారి. అభివృద్ధికి ఐటీఆర్‌ ఓ సూచిక. ఐటీఆర్‌ దాఖలు ఎంత ఎక్కువ పెరుగుతుంటే అంత ఎక్కువ అభివృద్ధి చెందుతున్నట్లు లెక్క. అభివృద్ధి అంటే భారీ భవనాలు కాదు.. భారీగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయటమే. కాగా, కరోనా లాంటి సంక్షోభం ఉన్నప్పటికి గత ప్రభుత్వంలో కంటే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సంపద పెరిగిందని, అప్పులు తగ్గాయని ఆర్థిక మంత్రి బుగ్గన గణాంకాలతో సహా మీడియాకు చెప్పారు.

చంద్రబాబు హయాంలో అప్పుల వార్షిక వృద్ధి రేటు 14.7 కాగా.. ఇప్పుడు అది 12.4 శాతం ఉందని వెల్లడించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో ఏకంగా 5,500 కోట్ల అప్పు చేశారన్నారు. పౌర సరఫరాల సంస్థ ద్వారా గత సంవత్సరం 20 వేల కోట్ల అప్పులు చేస్తే.. ఇప్పుడు 10 వేల కోట్లు మాత్రమే అప్పు చేశామన్నారు. మొత్తం లెక్కలతో సహా గత ప్రభుత్వం చేసిన అప్పులను.. ఇప్పుడు చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు. అప్పుల విషయంలో ప్రతి పక్ష పార్టీ చేస్తున్న రాద్ధాంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి, ఐటీ రిటర్న్స్‌లో ఏపీ టాప్‌లో నిలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి