iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్ పరీక్షల్లో సత్తా చాటిన AP విద్యార్థులు!

జగన్‌ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలతో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. తాజాగా మన విద్యార్థులు దేశ స్థాయిలో సత్తా చాటారు.

జగన్‌ సర్కార్ తీసుకువచ్చిన సంస్కరణలతో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. తాజాగా మన విద్యార్థులు దేశ స్థాయిలో సత్తా చాటారు.

ఇంగ్లీష్ పరీక్షల్లో సత్తా చాటిన AP విద్యార్థులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టారు. అమ్మ ఒడి, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చేశారు. అలానే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాం విద్యాను ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. అయితే జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటుతున్నారు. గతంలో ఏదైనా పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో రాయడానికి విద్యార్థులు వెనుకంజే వేసే వాళ్లు. కానీ నేడు విద్యార్థులు ఆ భయం పోగొట్టుకుని ముందంజలో దూసుకెళుతున్నారు. తాజాగా మన విద్యార్థులు దేశ స్థాయిలో సత్తా చాటారు.

ఇటీవల ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన విషయంలో దేశ వ్యాప్తంగా  నేషనల్ అచీవ్ మెంట్ సర్వే-2023 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాక ఈ పరీక్షల్లో మన విద్యార్థులు ప్రతిభ చూపించారు. ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ టాప్ ప్లేస్ సాధించడం గమనార్హం. అదే విధంగా జాతీయ సగటు కంటే రెట్టింపుగా మన విద్యార్థులు ఈ సర్వేలే పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు తీరుపై కేంద్రం  ఆ సర్వే నిర్వహించింది.

ఇందులో ఇంగ్లీష్ మీడియంలో 3,6,9 తరగతులు చదువుతున్న విద్యార్థులను ఎంపిక చేసి.. పరీక్ష నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల జాతీయ సగటు 37.03 శాతంగా ఉంటే, ఏపీ విద్యార్థు శాతం 84.11గా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో జాతీయ సగటు కంటే ఎక్కువ ప్రగతి ఏపీ విద్యార్థులతో సాధ్యమైంది.  బైలింగువల్ పుస్తకాల పంపిణీ, ఇంగ్లీష్ ల్యాబ్స్ తో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేకంగా బోధించడంతో విద్యార్థులు ఆంగ్ల పాఠ్యాంశాలను సులభంగా నేర్చుకుంటున్నారు.

అలాగే ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను ఆంగ్ల మాధ్యమంలో రాయడం వల్ల వారు భాషపై పట్టు సాధిస్తున్నారు.  దేశ వ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు కేంద్ర నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే, ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసి సర్వేను ఏటా నిర్వహిస్తుంది. 2021లో కేంద్రం ఎన్‌ఏఎస్, 2022లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ నిర్వహించింది.

కరోనా లాక్ డౌన్  అనంతరం నిర్వహించిన అప్పటి సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించింది. వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలు సైతం అమలు చేస్తోంది. ఇక ఈ పరీక్షల్లో  సౌత్ స్టేట్స్ కేరళ, కర్ణాటక, తమిళనాడు మనకంటే వెనుకబడడం గమనార్హం.పేదింటి పిల్లలు ఇంటర్నేషన్ ఛాన్ అందుకోవాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి అని భావించిన జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టడంతో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. మరి. ఇంగ్లీష్ పరీక్షల్లో  ఏపీ విద్యార్థులు సత్తా చాటడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.