iDreamPost
android-app
ios-app

పల్నాడులో ఇక పై అంతా పద్ధతిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చిన ఈ SP మేడమ్ బ్యాగ్రౌండ్ తెలుసా?

Palnadu First Lady Sp Malika Garg Biography: ఇటీవల ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతం దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాంతానికి తొలి లేడీ ఎస్పీగా లేడీ సింగం మల్లికా గార్గ్ ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆవిడ బ్యాగ్రౌండ్ ఏంటంటే?

Palnadu First Lady Sp Malika Garg Biography: ఇటీవల ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతం దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాంతానికి తొలి లేడీ ఎస్పీగా లేడీ సింగం మల్లికా గార్గ్ ను అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. ఆవిడ బ్యాగ్రౌండ్ ఏంటంటే?

పల్నాడులో ఇక పై అంతా పద్ధతిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చిన ఈ SP మేడమ్ బ్యాగ్రౌండ్ తెలుసా?

పల్నాడు ప్రాంతం.. మే 13న జరిగిన ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలకు, విమర్శలకు కారణం అయ్యింది. ఎన్నికలను ప్రశాంతంగా సాగకుండా.. కొందరు పనికట్టుకుని దుందుడుకు చర్యలు, రెచ్చగొట్టడం చూశాం. అంతా రాడ్లు, బ్యాట్లు, కర్రలు పట్టుకుని రోడ్ల మీద నానా హంగామా చేశారు. నాటు బాంబుల శబ్దాలకు పల్నాడు ప్రాంతం ఉలిక్కి పడింది. ఇక్కడ పది రోజుల్లో ఏకంగా 160 కేసులు నమోదు అయ్యాయి. 13000 మందికి పైగా అరెస్టు చేశారు. వారిలో 400 మందిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి తరుణంలో ఇక్కడికి ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ కావాలి. అలాంటి ఆమెనే ఆ ప్రాంతానికి ఆమెను డిపార్ట్ మెంట్ లో లేడీ సింగం అంటారు.

పల్నాడు ప్రాంతంలో ఎంతటి అల్లర్లు చెలరేగాయో అందరూ చూశారు. అలాంటి ప్రాంతానికి ఒక ఆఫీసర్ ని పంపిస్తున్నారు అంటే కచ్చితంగా వారి ట్రాక్ రికార్డు నెక్స్ట్ లవల్లో ఉండాలి. అలాంటి ఒక ఆఫీసర్ నే పంపారు. ఆమె పేరు లేడీ సింగం అలియాస్ మల్లికా గార్గ్. ఈ ఐపీఎల్ అధికారి గురించి దాదాపుగా పాన్ ఇండియా లెవల్లో అందరికీ తెలిసే ఉంటుంది. రౌడీ షీటర్ల గుండెల్లో సింహ స్వప్నం అంటారు. అలాగే వచ్చీ రాగానే పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే నేరుగా జైలుకు పంపేస్తానంటూ చెప్పేశారు. అలాగే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పల్నాడు జిల్లా పేరు మారుమోగుతున్న విషయాన్ని స్పష్టం చేశారు. తన మిత్రులు కూడా పల్నాడు జిల్లా గురించి అడుగుతున్నారు అన్నారు. ఇలాంటి బ్యాడ్ వేలో జిల్లా పేరు వినిపించడం సతోషంగా లేదు అంటూ చెప్పారు.

రేపు కౌంటింగ్ రోజు పల్నాడు ప్రాంతంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడాటమే తన భాద్యత అంటూ మల్లికా గార్గ్ వెల్లడించారు. అంతేకాకుండా ఎలాంటి అల్లర్లను, బ్యాట్లు తీసుకుని రోడ్ల మీదకు రావడాన్ని సహించేది లేదు అంటూ చెప్పేశారు. ప్రస్తుతం అందరూ మల్లికా గార్గ్ గురించే వెతికేస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి వచ్చీ రావడంతోనే అక్కడున్న వారికి ఇలాంటి మాస్ వార్నింగ్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ పని చేశారు? అసలు ఎవరూ ఈ లేడీ సింగం మేడమ్ అంటూ వెతికేస్తున్నారు. మల్లికా గార్గ్ పోలీస్ ఫ్యామిలీకి చెందినావిడే. ఆవిడ తండ్రి కూడా పోలీస్ గా చేశారు.

మల్లికా గార్గ్ తండ్రి డీజీపీగా కూడా పని చేశారు. ఢిల్లీ ఐఐటీ నుంచి బీటెక్ లో కంప్యూటర్స్ చేశారు. తన కాలేజ్ క్లాస్ మేట్, ఐపీఎస్ బ్యాచ్ మేట్ అయిన వకుల్ జిందాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట వెస్ట్ బెంగాల్ లో కొన్నాళ్లు పని చేశారు. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోనే విధులు నిర్వర్పించారు. ఆమె కృష్ణా, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో సేవలు అందించారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన తొలి లేడీ ఎస్పీగా చరిత్ర సృష్టించారు. జూన్ 4న కౌంటింగ్ రోజు మరో అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తామంటూ హామీ ఇచ్చారు.