P Venkatesh
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మీడియట్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం తేలిపోయింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో పలువురు విద్యార్థులు రికార్డ్ స్థాయిలో మార్కులు సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల తేదీలను ఏప్రిల్ 25న ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షలు ఏయే తేదీల్లో జరుగనున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఒకే రోజు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనుండగా, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జరుగుతాయి.