iDreamPost
android-app
ios-app

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!ఈ నెలాఖరు వరకు ఉచితంగా..!

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్!ఈ నెలాఖరు వరకు ఉచితంగా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం విషయంలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద అనేక కొత్త వైద్య చికిత్సను కూడా  చేర్చిన ఘనత సీఎం జగన్ ది. అలానే తరచూ వైద్య రంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు సీఎం జగన్. తాజాగా  ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. “జగనన్న ఆరోగ్య సురక్ష పథకం” కింద 30 రోజుల పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. వచ్చే నెల చివరి వారం నాటికి రాష్ట్రంలో  వైద్య శిబిరాల నిర్వహణ పూర్తయ్యేలా ప్లాన్ సిద్ధం చేశామని ఆమె తెలిపారు.

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. మండలానికి ఒక  గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వైద్య శిబిరాలు జరుగుతాయి. శిబిరంలో 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ పథకం గురించి ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనీ పలు కీలక విషయాలను వెల్లడించారు. వైద్య శిబిరానికి వచ్చిన రోగులకు భోజన సదుపాయం కల్పిస్తామని, ఇద్దరు సూపర్ స్పెషలిస్టు వైద్యులను, ఇద్దరు పీహెచ్‌సీ డాక్టర్లు పాల్గొంటారని మంత్రి రజని తెలిపారు.  అంతేతకాక ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు హాజరవుతారని తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.

నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ శిబిరాల్లో మొత్తం 342 మంది అనుభవం కలిగిన డాక్టర్లు సేవలందిస్తారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రిఫర్‌ చేస్తారు. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మరి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి