ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. తాజాగా వీఆర్ఏలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే వీఆర్ఏల DAపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. వీఆర్ఏల డీఏ విషయంలో క్లారిటీ ఇచ్చింది జగన్ సర్కార్. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఏపీ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న నెలకు రూ. 300 చొప్పున డీఏను కొనసాగించే ప్రతిపాదనలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. కొంత మంది వీఆర్ఏలు ట్రెజరీ డిపార్టుమెంట్ డైరెక్టర్ మెమో జారీచేసినప్పటికీ.. అదనంగా డీఏ డ్రా చేశారు. దీంతో వారి నుంచి ఆ అదనపు డీఏను రికవరీ చేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యం దీనిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అదనంగా డీఏ డ్రా చేసిన వీఆర్ఏల నుంచి రికవరీ చేయలేదని జగన్ సర్కార్ స్పష్టం చేసింది.
కాగా.. గత ప్రభుత్వ హయాంలో నెలకు DA కింద చెల్లించిన రూ. 300 లను కేవలం ఐదు నెలలకు మాత్రమే పరిమితం చేస్తూ.. 2019 జనవరిలో జీవో ఇచ్చినట్లుగా ప్రభుత్వం గుర్తుచేసింది. కాగా.. ఉద్యోగ సంఘాలు డీఏ పునరుద్దరించాలని కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదనలు తయ్యారు చేసింది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రంలో దాదాపు 19, 359 మంది VRAలు సేవలు అందిస్తున్నారని, వారికి మెమోలు జారీ చేసినప్పటికీ.. వారి నుంచి అదనంగా డ్రా చేసిన డీఏను రికవరీ చేయలేదని డిపార్ట్ మెంట్ తెలిపింది.
ఇక ఇటీవలే గ్రామ రెవెన్యూ అధికారులు సీఎం జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అర్హత కలిగిన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని వారు సీఎం జగన్ కు విన్నవించారు. ఈ అంశంపై జగన్ సానుకూలంగా స్పందించారని రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ.. వీఆర్ఏల డీఏపై జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా రూ. 2,016 పెన్షన్