iDreamPost

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా రూ. 2,016 పెన్షన్

  • Author Soma Sekhar Published - 08:09 AM, Tue - 1 August 23
  • Author Soma Sekhar Published - 08:09 AM, Tue - 1 August 23
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా రూ. 2,016 పెన్షన్

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాలలో భాగంగా ఇప్పటికే వితంతువులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తూ వస్తోంది తెలంగాణ సర్కార్. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇక నుంచి మరో వర్గానికి కూడా రూ.2,016 పెన్షన్ ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు వర్గాలకు ఆసరా పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో వర్గానికి కూడా పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు లతో పాటుగా మరికొందరికి పెన్షన్ ఇస్తూ వస్తోన్న తెలంగాణ సర్కార్.. తాజాగా బీడీ టేకేదార్లకు కూడా ఆసరా ఫించన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీడీ టేకేదార్లకు నెలకు రూ. 2,016 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని కేటీఆర్ తెలిపారు. కాగా.. బీడీ కార్మికులు చేసిన చేసిన బీడీలను లెక్కించి, వాటిని ప్యాకింగ్ చేసి, కంపెనీలకు అప్పగించడం టేకేదార్ల బాధ్యత. ఇక నుంచి వీరికి కూడా ప్రభుత్వం చేయూత అందించనుంది. దాంతో ఎన్నో కుటుంబాలకు లబ్దిచేకూరనుంది. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: ప్రజా గాయకుడు గద్దర్ కు గుండెపోటు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి