Venkateswarlu
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Venkateswarlu
ప్రజాసంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. అన్ని వర్గాల వారి అభివృద్దే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. కొత్త కొత్త పథకాలను ప్రవేశ పెడుతోంది. ముఖ్యంగా నవరత్నాల కారణంగా ప్రజలు ఎంతో లాభపడుతున్నారు. చిన్న పిల్లల దగ్గరినుంచి ముసలి వాళ్ల వరకు అందరూ సీఎం జగన్ చల్లని పాలనలో సంతోషంగా ఉన్నారటనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజల సమస్యలపై, పాలనపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ప్రజలకు అందాల్సిన పథకాలపై, ప్రజా సమస్యలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ఆయన అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ విషయంలోనూ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ..
‘‘ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వారందరికీ సకాలంలో మందులు అందించండి. మందుల కొరత కూడా లేకుండా చూసుకోండి. ఆరోగ్య శ్రీ వినియోగంపై అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయండి. డిసెంబర్ 20 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేయండి. ఏపీలోని ప్రతి ఒక్క పౌరుడి ఫోన్‌లో ఆరోగ్య శ్రీతో పాటు దిశ యాప్‌లు ఉండేలా అవగాహన కల్పించండి. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఉండకుండా చూసుకోండి.
రాష్ట్రంలోని ప్రతీ ఊరికి ఫ్యామిలీ డాక్టర్ వెళ్తున్న సమయంలో.. మందులు అందాయా..? లేదా..? తెలుసుకోండి. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ కార్యక్రమాలు నిర్వహించండి’’ అంటూ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కాగా, అకాల వర్షాలకు ఏపీలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కోత సమయంలో తుఫాను విరుచుకుపడుతుండటంతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు అండగా నిలిచారు. ఏ ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయినుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వర్షంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. సంపూర్ణ మద్దతు ధరకే పంటను కొంటోంది. మరి, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.