ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు షెడ్యూల్ ను గెజిట్ నెంబర్ 26 ద్వారా విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సహనీ. పలు కారణాల చేత ఖాళీ అయిన సర్పంచ్, వార్డ్ మెంబర్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ లో వివిధ కారణాల చేత ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ను గెజిట్ నంబర్ 26 ద్వారా ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సహనీ విడుదల చేశారు. కాగా.. మెుత్తం 1033 గ్రామ పంచాయతీల్లో 66 మంది సర్పంచ్ లు, 1063 మంది వార్డు మెంబర్ల పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక షెడ్యూల్ వివరాల్లోకి వెళితే.. ఈ ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 8వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచే ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 10 సాయంత్రం 5 గంటలు.
కాగా.. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు అధికారులు. ఇక అసలు సమరం అయిన ఎన్నికలు ఆగస్టు 19వ తేది ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నానం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. దాంతో ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీల్లో రాజకీయం హీటెక్కింది.
ఇదికూడా చదవండి: ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం: సీఎం జగన్