iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. రేపు వాళ్లందరికీ సెలవు ప్రకటించిన అధికారులు!

Special Leave For Employees: ఉద్యోగులకు అధికారులు శుభవార్త చెప్పుకొచ్చారు. రేపు ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Special Leave For Employees: ఉద్యోగులకు అధికారులు శుభవార్త చెప్పుకొచ్చారు. రేపు ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గుడ్ న్యూస్.. రేపు వాళ్లందరికీ సెలవు ప్రకటించిన అధికారులు!

ఉద్యోగులు ఎవరైనా ఒకరోజు సెలవు వస్తోంది అంటే.. చిన్న పిల్లల్లా హ్యపీ అయిపోతారు. ఎప్పెడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొందరు ఉద్యోగులకు అలాంటి శుభవార్త అందింది. వారికి మంగళవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ అదృష్టవంతులు మరెవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న వాళ్లు. అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ సెలవు ప్రకటిస్తూ ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురు మొదురు సంఘటనలు మినహా అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఎన్నికలు అంత ప్రశాంతంగా జరిగాయి అంటే అందులో ఎన్నికల అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటి పోలింగ్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి మరుసటి రోజు అంటే.. మే 14న ప్రత్యేక సెలవు ప్రకటించాలంటూ.. ఏపీ ఎన్జీవో, ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ విజ్ఞప్తి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పోలింగ్ గురించి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుంది. క్యూ లైన్ లో 300 మంది వరకు వేచి ఉంటే మాత్రం పోలింగ్ రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉంటుంది. అన్ని కేంద్రాల్లో పూర్తిగా ఓటింగ్ ముగిసిన తర్వాత అసలు ఎంత శాతం మేర ఓటింగ్ నమోదు అయ్యిందో వెల్లడిస్తాం. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల కాస్త ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా డేటా మాత్రం భద్రంగా ఉందని ఇంజినీర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి రీపోలింగ్ కోసం విజ్ఞప్తులు, ఫిర్యాదులు రాలేదు” అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా వ్యాఖ్యానించారు. మే 14న పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక సెలవు ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.