P Krishna
Anakapalli Pharma Company: ఏపీలో వరుస ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపుం సేజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించిన ఘటన మరువక ముంతే మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Anakapalli Pharma Company: ఏపీలో వరుస ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న అనకాపల్లి జిల్లా అచ్యుతాపుం సేజ్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించిన ఘటన మరువక ముంతే మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్లో వణుకు పుట్టిస్తుంది. అనకాపల్లి జిల్లాలో బుధవారం అచ్యుతాపుం సేజ్‌లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రికాక్టర్ పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందారు. 60 మంది వరకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు ధాటికి ఫార్మ కంపెనీ పై కప్పు కూలిపోయింది.. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరంలో పడిపోయారు. ఈ దారుణ ఘటన మరువక ముందే ఏపిలో మరో ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో కంపెనీలో రియక్టర్ పేలుడు ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అనకాప్లలి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటిలో ఉన్న సినిర్జిన్ యాక్టీవ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్థరాత్రి 12:30 గంటల ప్రాంతంలో నలుగురు కార్మికులు రసాయనాలు కలుపుతుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. క్షత గాత్రులను హుటాహుటిన విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
మరోవైపు విశాఖ ఇండస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరవాడ ఫార్మాసిటిలో జరిగిన ప్రమాదం ఘటనపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు సీఎం చంబ్రాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే హూం మంత్రి అనితతో మాట్లాడి తక్షణమే ఇండస్ ఆస్పత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆదేశించారు. పరవాడ ఫార్మాసిటీ లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాధితులు కె. సూర్యనారాయణ, కెమిస్ట్.. రోయా అంగిరియా, పి లాల్ సింగ్, కె వైభవ్- హెల్పర్ గా గుర్తించారు. వరసగా జరుగుతన్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీల యాజమాన్యాలను అలర్ట్ చేశారు అధికారు.. సెక్యూరిటీ సిస్టమ్ విషయంలో తగు జాగ్రతగా ఉండాలని సూచించారు.