iDreamPost
android-app
ios-app

పాలకొల్లులో అద్భుతం.. ఆమె చెప్పినట్లే చెరువులో అమ్మవారి విగ్రహం!

  • Published Feb 14, 2024 | 11:11 AM Updated Updated Feb 14, 2024 | 11:11 AM

Ammavari Idol in The Pond: పాలకొల్లులో అద్భుతం జరిగింది.. చెరువులో అమ్మవారి విగ్రహం ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు తరలి వచ్చారు.. అమ్మవారి మహిమ అంటూ మొక్కుతున్నారు.

Ammavari Idol in The Pond: పాలకొల్లులో అద్భుతం జరిగింది.. చెరువులో అమ్మవారి విగ్రహం ప్రత్యక్షం కావడంతో గ్రామస్థులు తరలి వచ్చారు.. అమ్మవారి మహిమ అంటూ మొక్కుతున్నారు.

  • Published Feb 14, 2024 | 11:11 AMUpdated Feb 14, 2024 | 11:11 AM
పాలకొల్లులో అద్భుతం.. ఆమె చెప్పినట్లే చెరువులో అమ్మవారి విగ్రహం!

పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి వస్తువులు, విగ్రహాలు, నాణేలతో పాటు ఎన్నో రకాల వస్తువులు బయటపడుతుంటాయి. వాటిని బట్టి మానవులు ఆ కాలంలో ఎలా జీవించారు.. వారి జీవన శైలి ఎలా ఉండేది అని పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి చెబుతుంటారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. కొన్నిసార్లు ఊరికి సంబంధించిన వారి కలలో గ్రామ దేవతలు కనిపించి తమకు పూజలు, జాతర జరిపించాలని చెప్పడం.. అమ్మవారు చెప్పిన ప్రకారం జాతర్లు జరిపించడం చూస్తూనే ఉన్నాం. అలా ఓ మహిళ అమ్మవారు కనిపించి చెప్పింది నిజం కావడంలో ఊరంతా ఇది అమ్మవారి అద్భుతం అంటూ పూజలు చేస్తున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అద్బుతం చోటు చేసుకుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామయ్య హాలు సమీపంలో అమ్మవారి విగ్రహం బయటపడటంతో గ్రామస్థులు భక్తితో పరవశించిపోతున్నారు. స్థానికంగా ఉండే ఓ మహిళకు అమ్మవారు ఒంట్లోకి వచ్చి స్థానికంగా ఉన్న చెరువులో తన రూపం ఉందని చెప్పడంతో స్థానికులు అక్కడ ఉన్న చెరువులో వెతికారు. ఆ మహిళ చెప్పినట్టుగానే చెరువులో అమ్మవారి విగ్రహం లభించింది. వెంటనే మహిళలు భారీగా అక్కడికి చేరుకొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారు చెప్పిన చోటే విగ్రహం దొరకడం నిజంగా అమ్మవారి మహిళ అంటూ పూజలు నిర్వహిస్తున్నారు.

గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి దేవతా మూర్తుల విగ్రహాలు అభ్యమయ్యాయి. శాస్త్రోత్తంగా ఆ విగ్రహాలకు గుడిలో ప్రాణ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. పాలకొల్లులో అమ్మవారి విగ్రహం దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు.. అమ్మగాకి మహిమ ఎంత గొప్పదో చాటి చెప్పిందని భక్తులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. విగ్రహం బయట పడ్డచోట విలువ కూడా లభ్యమైందని.. దీంతో ఇక్కడ వివాదం చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగి పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి విగ్రహాన్ని తమకు తిరిగి అప్పగించాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని రామయ్యహాలు ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.