iDreamPost

రెయిన్ అలర్ట్.. ఆ 13 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

మండుటెండల్లో ప్రజలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. రాష్ట్రంలో రాగల ఐదురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ ఆ పదమూడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మండుటెండల్లో ప్రజలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. రాష్ట్రంలో రాగల ఐదురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ ఆ పదమూడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

రెయిన్ అలర్ట్.. ఆ 13 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భగభగమండే ఎండలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 45 డిగ్రీలపై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. మండుటెండలకు జనాలు బయటికి వచ్చేందకు జంకుతున్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఏసీలు, కూలర్ల కింద సేదతీరుతున్నారు. ఇక ఎండలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అందించింది. గతకొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల ఐదురోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అంతేకాదు నేడు ఆ పదమూడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఓ వైపు భానుడి ప్రతాపం.. మరోవైపు ఎన్నికల వేడితో తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ అందించింది. ఏపీలో రాబోయే అయిదు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతే కాదు నేడు ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు ఏవంటే.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఆదివారం కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ వెల్లడించారు. అదే సమయంలో పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందన్నారు. భారీ వర్షాలు కురువనుండడంతో ప్రజలకు ఎండల నుంచి బిగ్ రిలీఫ్ కలగనున్నది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దని ప్రజలను కోరారు. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి