iDreamPost
android-app
ios-app

కొత్త సంవత్సరంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్!

కొత్త సంవత్సరంలో  తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశం నలుమూలనుంచే కాకుండా ప్రపంచ నలుమూలలనుంచి కూడా భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరిస్తుంటారు. పండుగలు, సెలవులు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఇక తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. రద్దీ కారణంగా దైవ దర్శనానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది.

అంతేకాదు! రద్దీ కారణంగా దర్శనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ భక్తుల కోసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇక, 2024, జనవరి నెలకు సంబంధించి.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనం, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్‌ బుకింగ్‌ షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. బుధవారం టికెట్‌ కేటాయింపు షెడ్యూల్‌ విడుదలైంది.

ఆ వివరాలు :

  • సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధనతో పాటు మరికొన్ని సేవల టిక్కెట్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ‌డిప్ రిజిస్ట్రేషన్ అక్టోబరు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది.
  • రూ. 500, 1000 వర్చువల్ సేవా టికెట్లను అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
  • అంగ ప్రదక్షిణం టికెట్లు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు.. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.
  • 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.